కల్కి2 నుంచీ తప్పించడంపై దీపికా స్పందిస్తుందా?
అయితే ఆ సమయంలో దీపికా ఏమి స్పందించకుండా ఒక ఈవెంట్ లో పాల్గొని.."తన మనసు చెప్పిన మాటే వింటాను".. అని చెప్పి కౌంటర్ ఇచ్చింది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న దీపికా పదుకొనే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఎప్పుడైతే టాలీవుడ్లో తొలి సినిమాలో నటిస్తానని చెప్పి తప్పుకుందో అప్పటినుంచి ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు రాగా.. ఆ తర్వాత ఈమెను తొలగిస్తూ ఆ స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకుంటున్నట్లు సందీప్ అధికారికంగా ప్రకటించారు.
ఆ సమయంలో దీపికా పదుకొనే పీఆర్ టీమ్ చేసిన పోస్ట్లు కాస్త సందీప్ రెడ్డి వంగా పై నెగిటివిటీ క్రియేట్ చేశాయి. దీంతో సందీప్ స్పందిస్తూ.." ఒకరిని నమ్మి కథ చెప్పిన తర్వాత దానిని పూర్తిగా వారిలోనే దాచుకోవాలి. బయటకు లీక్ చేయకూడదు.. పైగా నిబద్ధత లేకపోవడం, పని గంటలలో విభేదాలు ఇలా తదితర కారణాలవల్ల సినిమా నుంచి తొలగిస్తున్నాం" అంటూ సందీప్ కామెంట్లు చేశారు. అంతేకాదు "డర్టీ పీ ఆర్ గేమ్" అంటూ దీపిక పీఆర్ టీం పై సందీప్ రెడ్డివంగా సంచలన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే .
అయితే ఆ సమయంలో దీపికా ఏమి స్పందించకుండా ఒక ఈవెంట్ లో పాల్గొని.."తన మనసు చెప్పిన మాటే వింటాను".. అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. ఇక ఆ సమస్య అక్కడితో సద్దుమణిగింది అనుకునే లోపే.. ఇప్పుడు కల్కి2 నుంచి తప్పిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి కల్కి 2898AD సినిమాలో దీపిక భాగం అయింది.. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా రోజులే సాగింది. అటు ఈ సినిమా స్థాయి, విజువల్స్ పరంగా ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో దీపికా నటన కూడా అద్భుతం అనే చెప్పాలి.
దీంతో సీక్వెల్ లో కూడా దీపికా కీలకపాత్ర పోషిస్తుందని అందరూ భావించారు. తల్లి అయిన తర్వాత ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు సడన్గా దీపికా సీక్వెల్లో భాగం కాదని వైజయంతి మూవీ మేకర్స్ అధికారికంగా పోస్ట్ తో సహా ప్రకటించారు. దీంతో దీపికా పాత్ర ఎవరైనా పోషిస్తారా లేక మొదటి భాగంలోనే ఈమె పాత్ర ఎండ్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అలా దీపిక పేరు అటు సందీప్ రెడ్డి వంగతో ఇటు వైజయంతి మూవీస్ బ్యానర్ తో కలిపి పెద్ద ఎత్తున ట్రెండింగ్ లో నిలవడంతో.. ఇప్పుడు కల్కి 2 నుంచి తప్పించడం పై దీపిక ఏదైనా స్పందిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు దీపిక కచ్చితంగా స్పందించాల్సి ఉంటుందని.. లేకపోతే ఈమెపై మరింత నెగెటివిటీ పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకైనా తనపై పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించడానికి దీపికా ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.