30 ఏళ్లుగా ప్ర‌పంచానికి ప్రేమ‌-క‌ల్చ‌ర్‌ను నేర్పించిన సినిమా

ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భార‌తీయ‌త‌ను సంస్కృతిని మేళ‌వించి ఈ సినిమాని మ్యూజిక‌ల్ క్లాసిక్ గా నిల‌బెట్టిన గొప్ప ద‌ర్శ‌కుడిగా అత‌డికి పేరొచ్చింది.;

Update: 2025-10-20 11:39 GMT

భార‌తీయ సంస్కృతి- సాంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు, ప్రేమ, వివాహం .. ఇలా ఎన్నో టాపిక్స్ ని ప్ర‌పంచానికి విస్త్ర‌తంగా ప‌రిచ‌యం చేసిన సినిమాగా `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` ప్ర‌సిద్ధి చెందింది. ఈ చిత్రం విడుద‌లై నేటికి 30 సంవ‌త్స‌రాలు. ఇప్ప‌టికీ అది ఒక గొప్ప క్లాసిక్ చిత్రంగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి ఉంది. ఈ చిత్రంలో రాజ్ పాత్ర‌లో షారూఖ్ న‌ట‌న‌, అంద‌మైన ప్రేమికురాలిగా కాజోల్ ఆహార్యాన్ని, అమ్రిష్ పురి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.

అల్ల‌రిత‌నం, చిలిపిత‌నం క‌ల‌గ‌లిసిన పాత్ర‌లో షారూఖ్ అసాధార‌ణ న‌ట‌న మైమ‌రిపించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై ఈ చిత్రం చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. భార‌తీయ సంస్కృతిని అమెరికా, యూకే స‌హా ప్ర‌పంచ దేశాల్లోని ఇండియన్ డ‌యాస్పోరా ఉన్న ప్ర‌తి చోటా పరిశీలించేందుకు కార‌ణ‌మైంది.

ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భార‌తీయ‌త‌ను సంస్కృతిని మేళ‌వించి ఈ సినిమాని మ్యూజిక‌ల్ క్లాసిక్ గా నిల‌బెట్టిన గొప్ప ద‌ర్శ‌కుడిగా అత‌డికి పేరొచ్చింది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత ఎంద‌రో దిగ్ధ‌ర్శ‌కులు అలాంటి మ‌రో సినిమా తీసి హిట్టు కొట్టాల‌ని త‌పించారు. కానీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ఫ్లేవ‌ర్ ని మాత్రం తేవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. 30 సంవత్సరాల ప్ర‌యాణాన్ని పురస్కరించుకుని షారుఖ్ తన పాపుల‌ర్ ఐకానిక్ డైలాగ్ ``బడే బడే దేషోన్ మే ఐసీ చోటి చోటి బాతేన్ హోతీ రెహతీ హైన్...``ని గుర్తు చేసుకున్నారు.

డిడిఎల్‌జే విడుదలై 30 సంవత్సరాలు అయినట్లు అనిపించడం లేద‌ని ఖాన్ కాస్త ఎమోష‌న‌ల్ గా అన్నారు. ``బడే బడే దేశోన్ మే ఐసీ చోటీ చోటీ బాతేన్ హోతీ రెహ్తీ హై... కాబట్టి ఇది నిన్ననే జ‌రిగిందా?`` అనిపిస్తుంది కానీ ఇప్పటికీ నమ్మశక్యం కానిది. రాజ్ పాత్ర పోషించినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుండి నాకు లభించిన ప్రేమకు నేను నిజంగా కృతజ్ఞుడను. వారి హృద‌యాల్లో రాజ్ చిర‌స్థాయిగా నిలిచిపోయారు. నేను ఎప్పటికీ దీనిని మర్చిపోలేను... సినిమా చూసి ప్రేమలో పడతాను`` అని ఖాన్ అన్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలపై చూపిన ప్రభావం అపూర్వమైనది. చాలా మంది జంటలు నన్ను కలిసి ఈ సినిమా చూసిన తర్వాత మేం వివాహం చేసుకున్నామని లేదా ప్రేమలో పడ్డామని చెప్పారు. భారతదేశం, దక్షిణాసియావాసుల పాప్ సంస్కృతిపైనా ఈ చిత్రం చాలా గొప్ప‌ ప్రభావాన్ని చూపింది అని అన్నారు. స్వ‌చ్ఛ‌మైన హృద‌యంతో ఈ చిత్రాన్ని నిర్మించిన య‌ష్ జీకే ఈ క్రెడిట్ ద‌క్కుతుంది.. అని ఎమోష‌న‌ల్ గా స్పందించారు. ఈ చిత్రంలో కాజోల్, అమ్రిష్ పూరి, ఫరీదా జలాల్, అనుపమ్ ఖేర్, పర్మీత్ సేథి, మందిరా బేడి త‌దిత‌రులు నటించారు.

Tags:    

Similar News