బాలయ్యకి తేజస్వి.. చిరుకి సుస్మిత..!
స్టార్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు వాళ్ల క్రేజ్ ని చూస్తూ పెరిగిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ల పీక్ టైం ను మళ్లీ చూడాలని ఉంటుంది.;
స్టార్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు వాళ్ల క్రేజ్ ని చూస్తూ పెరిగిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ల పీక్ టైం ను మళ్లీ చూడాలని ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి ఇలాంటి సందర్భం వస్తుంది. తమ అభిమాన హీరో మాస్ స్టామినా ఏంటో చూపిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఐతే అదే సేమ్ ఫీలింగ్ ఆ స్టార్స్ ఇంట్లో కూడా వస్తుంది. ఆ టైంలోనే సీనియర్ స్టార్ తనయురాళ్లు వాళ్లకి సూపర్ బూస్టప్ ఇస్తున్నారు. సీనియర్ హీరోలు తమ ఒకప్పటి వైబ్ ని తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా..
ఈ క్రమంలో బాలకృష్ణ కూతురు తేజస్వి బాలయ్యలోని ఫన్ యాంగిల్ ని అందరికీ చూపించాలని అన్ స్టాపబుల్ షో వచ్చేలా చేశారు. ఆమె ప్రోత్సాహం ఇంకా ప్లానింగ్ వల్లే అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా 3 సీజన్లు పూర్తి చేసుకుంది. ఐతే అన్ స్టాపబుల్ మాత్రమే కాదు బాబీతో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా స్టోరీ రిఫరెన్స్ కూడా తేజశ్వి ఇచ్చిన హింట్స్ తోనే అని తెలిసిందే.
ఇలా తమ ఇంట్లో ఉన్న సీనియర్ స్టార్ ని ఎలా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో అది జరిగేలా చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా విషయంలో కూడా సుస్మిత హ్యాండ్ తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సినిమా అనేలా మెగా వైబ్ ని తీసుకొచ్చింది.
చిరంజీవిని రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు..
మళ్లీ చిరంజీవిని రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమాల్లో ఎనర్జీ చూస్తున్నాం అంటూ చిరు గురించి మాట్లాడుతున్నారు. ఐతే ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ తో పాటుగా సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా నిర్మాణ భాగస్వామ్యం అయ్యింది. సో మెగా మూవీకి మెగా డాటర్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ ఫుల్ అయ్యింది.
చిరు బాలయ్య ఇద్దరి విషయంలో తమ డాటర్స్ వాళ్లని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి కథతో వాళ్ల ఇన్ పుట్స్ తో మంచి అవుట్ పుట్ వచ్చేలా చేసుకున్నారు. ఓ విధంగా అది వాళ్ల ఐడియానే కానీ ఇలాంటి సినిమా కావాలని ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ల కారణంగానే అలాంటి కథలను వారు రిఫర్ చేశారని చెప్పొచ్చు. మరి ఇదే ఐడియాని అటు వెంకటేష్ ఇటు నాగార్జున కూడా ఫాలో అయితే వాళ్లు కూడా ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ ని అందించే ఛాన్స్ ఉంటుంది.
డాకు మహారాజ్ కి తేజస్వి.. మన శంకర వరప్రసాద్ సినిమాకు సుస్మిత ఇలా ఇద్దరు కూడా తమ ఫాదర్ సినిమాలకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ తో ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ అందించారు. సో ఈ సినిమాలు రావడానికి కారణమైన వాళ్లకి కూడా ఫ్యాన్స్ తమ అభినందనలు తెలుపుతున్నారు.