• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Nani 33: 'దసరా' కాంబో ఈజ్...

Nani 33: 'దసరా' కాంబో ఈజ్ బ్యాక్!

| ఈ మూవీ వచ్చి నేటికి సరిగ్గా ఏడాది గడిచిన నేపథ్యంలో హీరో నాని ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ తో వచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-03-30 17:40 GMT

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ లవ్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద 100 కోట్లకు పైగా వసూళ్ళు కొల్లగొట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ వచ్చి నేటికి సరిగ్గా ఏడాది గడిచిన నేపథ్యంలో హీరో నాని ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. 'దసరా త్రయం మళ్లీ వచ్చింది' అంటూ తాజాగా #Nani33 అప్డేట్ అందించారు.


'దసరా' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల.. డెబ్యూతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, మంచి కమర్షియల్ సక్సెస్ సాధించారు. నాని మునుపెన్నడూ చూడని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఫస్ట్ మూవీతోనే క్రేజీ డైరక్టర్ గా మారిన శ్రీకాంత్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఏడాదిగా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న యువ దర్శకుడు.. తదుపరి సినిమాని కూడా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో - నిర్మాతలకే చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్ లో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో #Nani33 అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్ కలర్ లో డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ వైలెన్స్ ను సూచిస్తుంది. "నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు" అనే లైన్స్ ను మనం ఇక్కడ చూడొచ్చు.

ఇందులో నాని పాత్ర నేపథ్యాన్ని సూచించే విధంగా, అతని ఫేస్ ను జనాలతో డిజైన్ చేశారు. నాని కళ్లద్దాలు పెట్టుకొని.. రఫ్ గడ్డం, మెలితిప్పిన మీసాలతో మాసీ అవతార్‌లో కనిపిస్తున్నాడు. అతను స్టైల్ గా నోట్లో సిగార్ పెట్టుకొని పొగ వదలడాన్ని మనం గమనించవచ్చు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే శ్రీకాంత్ ఓదెల ఈసారి నానిని మరో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారని అర్థమవుతోంది. 'దసరా' దర్శక హీరోలు మరోసారి విలక్షణమైన స్క్రిప్టుతో రాబోతున్నారని తెలుస్తోంది.

"విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస దాని సరైన రూపాన్ని తీసుకుంటుంది. Nani33 తో త్వరలో రక్తపాతానికి సిద్ధంగా ఉండండి. దీని కోసం మీ ఊపిరి బిగపట్టుకొని ఉండండి" అని మేకర్స్ పేర్కొన్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవే. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారు.

ఇకపోతే గతేడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న నాని.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత సుజీత్ డైరెక్షన్ లో Nani32 మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఇదే క్రమంలో శ్రీకాంత్ ఓదెలతో Nani33 సినిమా చేయనున్నారు.

Tags:    
  • Tollywood 
  • Dasara 
  • Nani 
  • Srikanthodela 
  • Nani33 
  • Poster 
  • Nani33Poster 
  • SudhakarCherukuri 
  • SriLakshmiVenkateswaraCinemas 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS