• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీడియాకు మిడిల్ ఫింగ‌ర్...

మీడియాకు మిడిల్ ఫింగ‌ర్ చూపించిన హీరో ద‌ర్శ‌న్

| అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో క‌న్నడ స్టార్ దర్శన్ తూగుదీప ప్రస్తుతం జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-09-13 09:30 GMT

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో క‌న్నడ స్టార్ దర్శన్ తూగుదీప ప్రస్తుతం జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిమాండ్ ని పొడిగించారు. గురువారం నాడు దర్శన్‌ను బళ్లారి జైలు నుండి బయటకు తీసుకువచ్చారు. అతడు జైలు వెలుపల నిలబడి ఉన్న ఫోటోగ్రాఫర్‌లకు మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ యారొగెన్సీని ప్ర‌ద‌ర్శించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

గురువారం నాడు, దర్శన్ భారీ భద్రతతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుపై చర్చించేందుకు ఆయన తన భార్య విజయలక్ష్మి, సోదరుడు దినకర్ స‌హా న్యాయవాదులను కూడా కలవనున్నట్టు సమాచారం. వైర‌ల్ గా మారిన తాజా వీడియో క్లిప్‌లో ద‌ర్శ‌న్ పోలీసులతో కలిసి జైలు ప్రాంగణంలో నడుస్తూ కనిపించాడు. జైలు వెలుపల ఉన్న మీడియా -ఫోటోగ్రాఫర్‌లను చూసిన అత‌డు త‌న మధ్య వేలును చూపించాడు. అతడు అనుచితమైన హావభావాలతో రెచ్చిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే కొంతమంది దర్శన్ అభిమానులు దీనికి సంతోషించారు. మీడియా దీనికి అర్హ‌మైన‌ది అనేది వారి ఉద్ధేశం. అయితే ద‌ర్శ‌న్ అనుచిత ప్రవర్తనపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జైల్లో ఉన్న సమయంలో దర్శన్ సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో దర్శన్ వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు లీక్ అయిన ఫోటో చాలా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అత‌డిని బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.

హత్య కేసులో ప్రమేయం:

జూన్‌లో త‌న అభిమాని అయిన‌ ఫార్మసిస్ట్ రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రావడంతో కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం షాక్‌కు గురైంది. దర్యాప్తు ప్రకారం.. దర్శన్ తన స్నేహితురాలు పవిత్ర గౌడను అవమానపరిచే వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాస్వామిని శిక్షించాలని భావించి కుట్ర‌ప‌న్నాడు. కొంద‌రితో క‌లిసి ఈ కిరాత‌కం చేసాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

I'm not his fan !
No doubt, he has done a mistake.
No doubt, he should be punished.
But...
Next time kai etthi ne torsu guru 🥱

Ethics less media have crossed all their limits 😐#DBoss #BossOfSandalwood #Darshan @dasadarshanpic.twitter.com/eoXaauD2FY

— 𝚁𝙰𝙹𝙴𝙴𝚅 (@R9twt) September 13, 2024
Tags:    
  • Darshan 
  • Police 
  • Jail 
  • Renukswamy 
  • Bangalore 
  • Sandlewood 
  • Filmindustry 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS