• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డార్లింగ్ సెకండ్...

డార్లింగ్ సెకండ్ సింగిల్.. సో కలర్ఫుల్!

| బలగం లాంటి సక్సెస్ తర్వాత ప్రియదర్శి సోలో హీరోగా వస్తోన్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2024-07-02 05:53 GMT

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ డార్లింగ్. హనుమాన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. జులై 19న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. బలగం లాంటి సక్సెస్ తర్వాత ప్రియదర్శి సోలో హీరోగా వస్తోన్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

అలాగే కాన్సెప్ట్ టీజర్ తో మూవీపై హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఒక సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ రోజు సాయంత్రం సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సాంగ్ ప్రోమో ఇప్పటికే యుట్యూబ్ లో వైరల్ అవుతోంది. నభా నటేష్ మీద ట్రావెల్ సాంగ్ లా ఈ పాటని చిత్రీకరించారు. రాహి రే అంటూ సాగే ఈ పాటని కాశర్ల శ్యామ్ రాశారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇప్పటి వరకు తెలుగు బిగ్ స్క్రీన్ పై ట్రావెల్ సాంగ్స్ ఎక్కువగా హీరో పాయింట్ అఫ్ వ్యూలోనే ఉంటాయి. అయితే మొదటి సారి డార్లింగ్ మూవీలో నభా నటేష్ మీద ట్రావెల్ సాంగ్ డిజైన్ చేయడం విశేషం. ఈ సాంగ్ లిరిక్స్, ట్యూన్స్ మెలోడియస్ గా ఉంది ఆకట్టుకున్నాయి. కచ్చితంగా సాంగ్ సంగీత ప్రియులని ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఆమె చివరిగా నితిన్ కి జోడీగా మ్యాస్ట్రో సినిమాలో నటించింది. తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని డార్లింగ్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. హనుమాన్ లాంటి గ్రాండ్ విక్టరీ తర్వాత ప్రైమ్ షో నుంచి వస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. అందుకే సినిమా ఎలా ఉంటుందా చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ఇక ప్రియదర్శి కూడా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఓ వైపు కమెడియన్ గా ఇతర హీరోల సినిమాలలో చేస్తూ హీరోగా మంచి కంటెంట్ బేస్ కథలని ఎంచుకుంటూ ముందుకి వెళ్తున్నాడు. నభా నటేష్ కి ఈ మూవీ మంచి సక్సెస్ కావాలి. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

Full View
Tags:    
  • Raahirelyrical 
  • Darlingmovie 
  • Priyadarshi 
  • Nabhanatesh 
  • Viveksagar 
  • Kapilkapilan 
  • Raahire 
  • Tollywood 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS