హీట్ పుట్టించే డ్రెస్ లో సంద్రం నడిబొడ్డున పడవ నడుపుతున్న దంగల్ బ్యూటీ..

ఈ క్రమంలోనే అసలు సూర్యుడు ప్రతాపానికి తట్టుకోలేకపోతుంటే ఇక్కడ దంగల్ బ్యూటీ మాత్రం తన అందాలతో మరింత హీట్ పుట్టించింది.;

Update: 2026-04-30 05:40 GMT

సమయం దొరికితే చాలు అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఎంతోమంది హీరోయిన్స్ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించకుండానే వెకేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అసలే సమ్మర్.. ఇంట్లో ఉండలేక వెకేషన్ కోసం చిల్ అవ్వడానికి బయటకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మలు ఎంతోమంది ఇలా తమ అందాలను ఆరబోస్తూ బికినీ తలపించేలా డ్రెస్సులు ధరించి అభిమానులకు చెమటలు పట్టిస్తున్నారు.




 




 


ఈ క్రమంలోనే అసలు సూర్యుడు ప్రతాపానికి తట్టుకోలేకపోతుంటే ఇక్కడ దంగల్ బ్యూటీ మాత్రం తన అందాలతో మరింత హీట్ పుట్టించింది. పైగా సంద్రం నడిబొడ్డున పడవ నడుపుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.ఆమె ఎవరో కాదు ఫాతిమా సనా షేక్. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 2016 లో వచ్చిన దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రతో మంచి పేరు సొంతం చేసుకుంది. పైగా ఈ సినిమా ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి దశాబ్ద కాలం అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.




 


అలా ఈ ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అలా లూడో, సామ్ బహదూర్ వంటి చిత్రాలు చేసిన ఈమె అందులో అద్భుతమైన నటనను కనబరిచి అందరిని ఆకట్టుకుంది ..ఇక 2023లో వచ్చిన ధక్ ధక్ అనే చిత్రానికి గాను ఏకంగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డుకు నామినేషన్ కూడా పొందింది. గత ఏడాది మెట్రో ఇన్ డైనో సినిమాలో అలీ ఫజల్ సరసన నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఫాతిమా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయిపోయింది.




 




 


గ్లామర్ టచ్ ఇస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వేసవి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ మెరూన్ రెడ్ బికినీను తలపించేలా టాప్ ధరించి.. సంద్రంలో పడవను నడుపుతూ ప్రశాంతమైన అలల శబ్దాన్ని వింటూ ముగ్ధ మనోహరమైన మోముతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్యుని కిరణాలను ఆస్వాదిస్తూ ఎంతో స్వేచ్ఛగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఫాతిమా షేర్ చేసిన ఈ ఫోటోలు అసలైన సమ్మర్ వెకేషన్ కి అద్దం పడుతున్నాయి. ఇక మొత్తానికి అయితే హాలిడేస్ ను ఈ ముద్దుగుమ్మ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.





 


 


ఇకపోతే ఫాతిమా సనా షేక్ ఇటు వెబ్ సిరీస్ లతో కూడా సందడి చేస్తోంది. ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ టీన్ కౌవే తో పాటు మరొకటి న్యాయ అనే వెబ్ సిరీస్ లలో నటిస్తోంది . ఇక ఈ రెండు కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నాయి.

Tags:    

Similar News