స్టార్ హీరోల పాలిట స్వేచ్ఛాయుత డైరెక్ట‌ర్!

స్టార్ హీరోల‌కు స్టోరీలు చెప్పి ఒప్పించ‌డం అంత సుల‌భం కాదు. ఈ ప్రోస‌స్ లో హీరో-డైరెక్ట‌ర్ మ‌ధ్య కొంత ట్రావెలింగ్ అనేది ఉంటుంది.;

Update: 2025-08-05 13:30 GMT

స్టార్ హీరోల‌కు స్టోరీలు చెప్పి ఒప్పించ‌డం అంత సుల‌భం కాదు. ఈ ప్రోస‌స్ లో హీరో-డైరెక్ట‌ర్ మ‌ధ్య కొంత ట్రావెలింగ్ అనేది ఉంటుంది. హీరోలు కూడా క‌థ‌ల్లో భాగ‌స్వామ్యం అవుతుంటారు. క‌థ‌లో అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులపై కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు. హీరోతో డైరెక్ట‌ర్ మింగిల్ అయితే ప‌ర్వా లేదు. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. సాపీగా ప్రాజెక్ట్ ముందుకెళ్లిపోతుంది. అలా క‌నుక జ‌ర‌గ లేదంటే? క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆటంకాలు త‌ప్ప‌వు. ఒక్క‌సారి ఇలాంటి డిఫ‌రెన్సెస్ త‌లెత్తితే కుదురుకోవ‌డం అన్న‌ది అతి క‌ష్ట‌మైన ప‌ని.

హీరోలేం త‌క్కువ కాదు:

ఇష్టం లేక‌పోయినా రాజీ ప‌డాల్సిన ప‌రిస్థితులు డైరెక్ట‌ర్ కు ఎదుర‌వుతుంటాయి. తాను అనుకున్న‌ది ఒక‌టైతే...మ‌రోలా వ‌స్తుంది? అన్న భావ‌న రిలీజ్ వ‌ర‌కూ డైరెక్ట‌ర్ ని వెంటాడుతూనే ఉంటుంది. సినిమా హిట్ అయితే ప‌ర్వాలేదు. లేదంటే? త‌ర్వాత అదే హీరోతో సినిమా చేయాలంటే వంద‌సార్లు ఆలోచిం చాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతుంటాయి. అలాగ‌ని హీరోల‌ను త‌క్కువ చేయడానికి లేదు. ఎందుకంటే న‌టులుగా ఎన్నో పాత్ర‌లు పోషించిన అపార అనుభ‌వంతోనే మార్పులు సూచిస్తుంటారు.

ఎవ‌రి భ‌యాలు వారివి:

చాలా సంద‌ర్భాల్లో వ‌ర్కౌట్ అవుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఫెయిలవుతుంది. ఆ కార‌ణంగా హీరోల‌నే టార్గెట్ చేయాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డ ఎవ‌రి భ‌యాలు వారికి ఉంటాయి. తాజాగా ఈ అంశంపై యంగ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయ‌న కూడా హీరోల పాలిట డైరెక్ట‌ర్ గానే మాట్లాడారు. ఒక్కోసారి హీరోల ఐడియాలు కూడా జ‌త క‌లిసిన‌ప్పుడు ఆ క‌ల‌యిక క‌థ‌ని మ‌రింత గొప్ప‌గా మారుస్తుంద‌న్నారు. దాన్ని చాలా మంచి ప‌రిణామంగా వ‌ర్ణించారు.

స్టోరీ డీవియేట్ కాకూడ‌దు:

త‌న క‌థ‌ల విష‌యం లో హీరో ఎప్పుడూ యాక్టివ్ గా పాల్గొన‌డం గొప్ప‌గానే భావిస్తాన‌న్నారు. త‌న సినిమా హీరోల‌కు క‌థ‌ల విష‌యంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌ని...అభిప్రాయాలు పంచుకోవ‌డంలో త‌ప్పేముంది అన్న భావ‌న వ్య‌క్తం చేసారు. తాను అనుకున్న పాయింట్ కంటే హీరో పాయింట్ ఆప్ వ్యూలో అదే క‌థ క‌నెక్ట్ అయితే? అక్క‌డ హీరో స‌క్సెస్ అయిన‌ట్లే క‌దా? అన్నారు. ఆ ర‌కంగా ఆలోచిస్తే క‌రెక్టే కదా అన్నారు. అయితే హీరో సూచించే మార్పులు ఏవైనా క‌థ‌ని డీవియేట్ చేయ‌కుండా ఉన్న‌ప్పుడే సాధ్య‌ప‌డుతుంద‌న్నారు.

అంద‌రితోనూ సాధ్యం కాదు:

అలా జ‌ర‌గలేదంటే చిన్న పాయింట్ కూడా క‌థా స్వ‌రూపాన్ని మార్చేస్తుంద‌ని అంచనా పూర్తిగా తారుమా ర‌వుతుంద‌న్నారు. అయితే గౌత‌మ్ క‌నెక్ట్ అయిన‌ట్లు చాలా మంది డైరెక్ట‌ర్లు క‌నెక్ట్ అవ్వ‌లేరు. అంద‌రూ ఈ పాల‌సీని అంగీక‌రించ‌రు. రాంగోపాల్ వ‌ర్మ‌, పూరిజ‌గ‌న్నాధ్, కొర‌టాల శివ లాంటి వారు హీరోల‌తో మింగిల్ అవ్వ‌రు. గ‌తంలో త‌మ‌కెదురైన అనుభ‌వాల దృష్ట్యా క‌థ‌ల్లో హీరోలు వేళ్లు పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కొంత మంది డైరెక్ట‌ర్లు స్టోరీలు సిద్దం చేసిన త‌ర్వాత ఆ క‌థ‌కు ఎవ‌రు స‌రితూగుతారో? వారినే ఎంపిక చేస్తారు.

కొర‌టాల సీరియ‌స్

మ‌రికొంత మంది హీరో ఇమేజ్ ఆధారంగా స్టోరీలు సిద్దం చేస్తుంటారు. చాలా మంది ద‌ర్శ‌కులు హీరోల భాగ‌స్వామ్యాన్ని స్వాగ‌తించ‌లేని విధంగా ఉంటారు. క్రియేటివ్ డిఫ‌రెన్స్ కార‌ణంగా ఆగిపోయిన సినిమా లెన్నో. ఆ మ‌ధ్య కొర‌టాల ఎవ‌రి ప‌ని వారు చేస్తే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని....అలా కాకుండా మ‌ధ్య‌లో కాళ్లు..వేళ్లు పెడితేనే స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News