మీడియాపై కాదు.. కంటెంట్ పై ఫోకస్ చేస్తేనే సక్సెస్!

కంటెంట్.. ఏ సినిమాకు ఇదే మెయిన్ అసెట్! అది సరిగ్గా.. విభిన్నంగా.. అద్భుతంగా ఉంటే.. అన్నీ డోంట్ కేర్ అని చెప్పాలి.;

Update: 2025-04-26 09:30 GMT

కంటెంట్.. ఏ సినిమాకు ఇదే మెయిన్ అసెట్! అది సరిగ్గా.. విభిన్నంగా.. అద్భుతంగా ఉంటే.. అన్నీ డోంట్ కేర్ అని చెప్పాలి. క్యాస్టింగ్ తో సంబంధం లేదు.. బడ్జెట్ తో సంబంధం లేదు.. ప్రమోషన్స్ తో సంబంధం లేదు.. మూవీ సూపర్ పక్కా హిట్ అవుతుంది. ఇది ఇప్పటికే ప్రూవ్ అయింది. ఎప్పటికప్పుడు అవుతూనే ఉంది కూడా..

అయితే కంటెంట్ బాగున్న సినిమాలు ఈ మధ్య తక్కువ వస్తున్నాయి. అందుకే సక్సెస్ రేట్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు కంటెంట్ పై ఫోకస్ చేస్తే బెటర్ అని.. మిగతా విషయాలపై కాదని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు సూచిస్తున్నారు. ఎందుకంటే సినిమా రంగంలో మీడియాను ఒక రీజన్ గా చూపిస్తూ సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయనే అపోహలతో కట్టడికి ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

పది పాయింట్లతో వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రకటనలు, ప్రీమియర్ల దగ్గర నుంచి అన్నీ కట్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం. డిజిటల్/ సోషల్ మీడియాకు బదులుగా హోర్డింగ్ లు, పేపర్ యాడ్ ల వంటి వగైరా ప్రమోషన్స్ తో పాటు సినిమా విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట!

సంప్రదాయ పబ్లిసిటీ విధానాల మీద దృష్టి సారించాలని ఆలోచన తీసుకొచ్చినట్లు వినికిడి. దీంతో ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. అలా మీడియా మీద కాకుండా.. ఫస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.

అయితే చాలా మంది సినీ ప్రమోషన్లు, యాడ్స్, సినిమా వాళ్లు లేకుంటే ఏకంగా మీడియా లేదని భావిస్తున్నట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. అది సరైన విధానం కాదని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే సంప్రదాయ పబ్లిసిటీ విధానాలు ఉన్నప్పుడు మీడియా ఉందని.. ఇప్పుడు కూడా అలాగే ఉందని కామెంట్లు పెడుతున్నారు.

మీడియా ఎప్పటికీ ఉంటుందన్నది అక్షరాలా నిజమని, సినిమా వాళ్లు లేకుంటే మీడియా లేదన్న మాట అబద్ధమని చెబుతున్నారు. అదే సమయంలో మూవీ విషయంలో ఆడియన్స్ ను ప్రమోషనల్ కంటెంట్.. టీజర్, ట్రైలర్ తో అట్రాక్ట్ చేయాలి. అది కంపల్సరీ. అప్పుడే మూవీపై సినీ ప్రియులతోపాటు అభిమానుల్లో బజ్ నెలకొంటుంది.

అదే సమయంలో మూవీ టాక్ బాగుంటే ఆడియన్స్.. మీడియా రివ్యూలను పట్టించుకోరు. ఒకవేళ రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు నష్టపోయిన సందర్భాలు మనం చూశాం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆడియన్స్ నిర్ణయాన్ని ఎవరూ డిసైడ్ చేయలేరు.. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ను ఎవరూ మార్చలేరు.

కాబట్టి ఇప్పుడు మీడియా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏం చేసినా.. సినిమా విషయంలో ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్. అందుకే ప్రణాళికలు, వ్యూహాల అస్త్రం.. సినిమా కంటెంట్ పై ప్రయోగిస్తే బెటర్ అని అంతా చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడే మంచి విజయాలు అందుతాయి. క్యాస్టింగ్ కు సూపర్ ఫేమ్ కూడా వస్తుంది.

Tags:    

Similar News