• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్టర్ బచ్చన్ సెట్ లో...

మిస్టర్ బచ్చన్ సెట్ లో సందడి అంతా ఆయనదే..!

| మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్ లో అందాల భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్

By - Tupaki Desk
Update: 2024-08-07 07:44 GMT

మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్ లో అందాల భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తూ సూపర్ అనిపించుకుంటున్నారు మేకర్స్.

హరీష్ శంకర్ కు సినిమా ఎలా తీయాలో కాదు ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలుసు. అందుకే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో కూడా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. రవితేజ వాయిస్ తో మెట్రో ట్రైన్ ప్రయాణీకులను పలకరించి సినిమా గురించి చెప్పించారు. ఇది బాగా వర్క్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా ఫ్రెండ్ షిప్ డే రోజు కూడా మిస్టర్ బచ్చన్ యూనిట్ అంతా కలిసి ఒక స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు.

ఆ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా సెట్ లో చేసిన హడావుడి అంతా కమెడియన్స్ చేసి చూపించారు. ముఖ్యంగా కమెడియన్ సత్య హరీష్ శంకర్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన కామెడీ అదిరిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత హరీష్ శంకర్ షూటింగ్ అంటే మిగతా వాళ్ల సంగతి ఏమో కానీ ఆయన హడావుడి మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని అర్థమవుతుంది. అంతేకాదు రవితేజను అన్నయ్య మీరు మాస్ మహరాజ్ అంటూ సీన్ బాగా రావడం కోసం మాట్లాడే తీరుని కూడా కొందరు ఇమిటేట్ చేశారు.

సినిమా సెట్ ఎంత సరదాగా ఉంటే సినిమా అంత బాగా వస్తుందని హరీష్ శంకర్ నమ్మకం కావొచ్చు. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ షూటింగ్ అనుభూతులతో ఫ్రెండ్ షిప్ డే నాడు ఆ సినిమా యూనిట్ అంతా కలిసి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ ముందు ఈ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయడం కూడా అది ప్రమోషన్స్ లో భాగమే అని చెప్పొచ్చు. సరదాగా సాగిన మిస్టర్ బచ్చన్ ఫ్రెండ్షిప్ డే హంగామా ప్రేక్షకులను అలరిస్తుంది.

Full View
Tags:    
  • Comediansatya 
  • Harishshankar 
  • Mrbachchan 
  • Bhagyashreeborse 
  • Raviteja 
  • Tollywood 
  • Mrbachchanmovie 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS