ఏడాదిలోనే గుడ్ న్యూస్ చెప్పేసిన జోడీ!

కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ ప్రేమ్ జీ అమ‌ర‌న్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో క‌మెడియ‌న్ గా నటిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు;

Update: 2025-09-06 10:30 GMT

కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ ప్రేమ్ జీ అమ‌ర‌న్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో క‌మెడియ‌న్ గా నటిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. హాస్యంలోనే వైవిథ్య‌ను పంచ‌డం ప్రేమ్ జీ ప్ర‌త్యేక‌త‌. రొటీన్ కామెడికి భిన్నంగా ప్రేమ్ జీ పాత్ర‌లు హైలైట్ అవుతుంటాయి. అయితే వివాహ ప‌రంగా ప్రేమ్ జీది ఆల‌స్య వివాహం. గ‌త ఏడాదే 45 ఏళ్ల వ‌య‌సులో నిరాడంబ‌రంగా వివాహం చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టాడు.

గ‌త ఏడాది జూన్ లో ఈ వివాహం జ‌రిగింది. అయితే ఏడాది తిరిగే లోపే ప్రేమ్ జీ -ఇందు ద‌ప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఇందు సీమంతం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఘ‌నంగా సీమంతం వేడుల‌కు జ‌రిగాయి. వాటిని సోష‌ల్ మీడియా లో పోస్ట్ చేస్తూ విష‌యాన్ని వెల్ల‌డించారు. సీమంత‌కు వ‌చ్చిన అతిధులుంగా భార్య‌భ‌ర్త‌లిద్ద‌ర్నీ అక్షింత ల‌తో ఆశీర్వ‌దించారు. నెట్టింట‌ ప్రేమ్ జీ దంప‌తుల‌కు నెటి జనులు శుభాకాంక్ష‌లు తెలియ జేస్తున్నారు.

ప్రేమ్ జీ న‌టుడిగా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే `వ‌ల్ల‌మై`, `దిన్సారీ` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం ప‌లు సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు. వాస్త‌వానికి ప్రేమ్ జీ ఇండ‌స్ట్రీకి సంగీత ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని వ‌చ్చాడు. కానీ ప‌రిశ్ర‌మ ఆయ‌న్ని న‌టుడ్ని చేసింది. ప్రేమ్ జీ తండ్రి గంగై అమ‌ర‌న్ ఓ పెద్ద సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న కుమారుడే ప్రేమ్ జీ. ఈ నేప‌థ్యంలో తండ్రి వార‌స‌త్వం కొన‌సాగించ‌డానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గానే కెరీర్ ప్రారంభించాడు.

యువ‌న్ శంక‌ర్ రాజా ద‌గ్గ‌ర కొంత కాలం ప‌నిచేసిన అనంత‌రం న‌టుడిగా కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. 2006లో `వ‌ల్ల‌వ‌న్` చిత్రంతో న‌టుడిగా తెరంగేట్రం చేసాడు. అప్ప‌టి నుంచి న‌టుడిగానే కొన‌సాగుతున్నాడు. ప్రేమ్ జీ సొద‌రుడే స్టార్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు. సోద‌ర‌డు తెర‌కెక్కించిన `చెన్నై 600028` సినిమాలో న‌టించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి న‌టుడిగా వెనుదిరిగి చూడ‌లేదు.

Tags:    

Similar News