వీకెండ్స్ ఎంటర్టైన్మెంట్ షురూ.. ఓటీటీ లోకి సందడి చేస్తున్న చిత్రాలు, సీరీస్ లివే!

వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ మొత్తం ఓటీటీలోనే సినిమాలు చూడాలని తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.;

Update: 2025-12-25 04:49 GMT

వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ మొత్తం ఓటీటీలోనే సినిమాలు చూడాలని తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే అటు ఓటీటీ ప్లాట్ ఫారమ్ కూడా సరికొత్త చిత్రాలతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈవారం క్రిస్మస్ తో పాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కాబట్టి వీకెండ్స్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి అటు చిత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటి? ఏ ప్లాట్ ఫారమ్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి? వస్తాయి?అనే విషయం ఇప్పుడు చూద్దాం.

మిడిల్ క్లాస్: (జీ5 డిసెంబర్ 24)

మునిష్కాంత్ , విజయలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం మిడిల్ క్లాస్. నవంబర్ 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే రోజువారీ ఇబ్బందులు, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను సరళంగా , హాస్య భరితంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు జీ5 వేదికగా డిసెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు భావోద్వేగం, పరిపూర్ణమైన కుటుంబ చిత్రాలను కోరుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఆంధ్ర కింగ్ తాలూకా (డిసెంబర్ 25, జియో హాట్ స్టార్):

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా.. ఒక మారుమూల గ్రామానికి చెందిన సాగర్ (రామ్ ) అనే వీరాభిమాని జీవిత కథను ఉద్దేశిస్తూ తెరకెక్కిన చిత్రమిది. అతని జీవితం ఆంధ్ర కింగ్ అని పిలవబడే సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా తన 100వ చిత్రాన్ని విడుదల చేయడానికి మూడు కోట్లు సూర్యకు అవసరమవుతాయి. ఆ డబ్బును సేకరించడానికి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. సడన్గా సూర్య ఖాతాలోకి మూడు కోట్లు జమ అవుతాయి. ఇంత డబ్బు ఇచ్చిన అభిమాని ఎవరా అని తెలుసుకొని నేరుగా అతడిని కలవడానికి సూర్య బయలుదేరుతారు. అలా హీరోకి అభిమానికి మధ్య జరిగే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ వేదికగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

రివాల్వర్ రీటా: (నెట్ ఫ్లిక్స్, డిసెంబర్ 26)

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రాధికా, సునీల్, రెడిన్ కింగ్స్ లీ, సూపర్ సుబ్బరాయణ్ , అజయ్, సెండ్రయాన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. జె కే చంద్రు దర్శకత్వంలో నవంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డిసెంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బాహుబలి: ది ఎపిక్ (నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 25)

బాహుబలి : ది బిగినింగ్ , బాహుబలి:బి కంక్లూజన్ చిత్రాలను ఒకటిగా ఎడిట్ చేసి బాహుబలి అక్టోబర్ 31న దీనిని విడుదల చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ పదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఇప్పుడు ఇది డిసెంబర్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (నెట్ ఫ్లిక్స్, డిసెంబర్ 26)

గత పది సంవత్సరాలుగా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ స్ట్రేంజర్ థింగ్స్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. సీజన్ 5 వాల్యూమ్ 2.. 5,6,7ఎపిసోడ్లు డిసెంబర్ 26 ఉదయం 6:30 గంటలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

కాషేరో (నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 26)

టీమ్ బెఫార్ రాసిన ప్రసిద్ధ కాకావో వెబ్ ట్యూన్ ఆధారంగా 8 ఎపిసోడ్ల సిరీస్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Tags:    

Similar News