'చియాన్ 63' టీజ‌ర్‌: ఈ కుక్ చాలా ప్ర‌మాద‌క‌రం.. మ‌నుషుల్ని వండుతాడు?

మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుడు అవ‌కాశం క‌ల్పించినా అదేమీ క‌లిసి రాలేదు.. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఆనంద్ శంక‌ర్ వినిపించిన స్టోరీకి క‌మిటైన‌ట్టు క‌నిపిస్తోంది;

Update: 2026-04-19 09:10 GMT

చియాన్ విక్ర‌మ్ కి త‌న రేంజ్ స్క్రిప్టు ప‌డిన‌ట్టు లేదు. మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుడు అవ‌కాశం క‌ల్పించినా అదేమీ క‌లిసి రాలేదు.. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఆనంద్ శంక‌ర్ వినిపించిన స్టోరీకి క‌మిటైన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో అత‌డిని ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన కుక్ పాత్ర‌లో చూపిస్తున్నారు. ఎక్క‌డి నుంచో గ్రెనేడ్ వ‌చ్చి త‌న వంట‌శాల‌లో ప‌డింది. అక్క‌డ అత‌డు ధీమాగా సిగ‌రెట్ వెలిగిస్తూ క‌నిపించాడు. త‌న ప‌క్క‌నే ప‌డింది గ్రెనేడ్ అనే భ‌యం కూడా అత‌డిలో క‌నిపించ‌లేదు.. ఇక ఆ వంట గ‌దిలో వ‌రుస‌గా పేర్చి ఉన్న‌ వంట పాత్ర‌లు చాలా పెద్ద క‌థ‌నే చెబుతున్న‌ట్టు అనిపిస్తోంది. టీజ‌ర్ వివ‌రాల్లోకి డీప్ గా వెళితే...

సీనియ‌ర్ హీరో విక్రమ్ తన ప్రతిభతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా అత‌డి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన `చియాన్ 63` టీజర్ (ఫస్ట్ ఫ్లేమ్) సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. `ఇరుముగన్` తర్వాత దర్శకుడు ఆనంద్ శంకర్‌తో విక్రమ్ చేస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టీజర్‌లో విక్రమ్ ఒక ప్రమాదకరమైన వంటవాడి (కుక్) పాత్రలో కనిపిస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది.

టీజర్ ప్రారంభంలో ఒక గొడౌన్ బయట కొందరు వ్యక్తులు తలుపులు బద్దలు కొడుతూ హడావిడి చేస్తూ.. గ‌ది లోపలికి గ్రెనేడ్ విసరడం కనిపిస్తుంది. అయితే లోపల ఉన్న విక్రమ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. ఎంతో తాపీగా కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తాడు. అతడు కేవలం వంటవాడే కానీ చాలా ప్రమాదకరం! అని వచ్చే వాయిస్ ఓవర్ సినిమాలోని ఇంటెన్సిటీని పెంచుతోంది. ఆ వంట గదిలో పేర్చి ఉన్న భారీ పాత్రలు.. చివరలో వచ్చే `కుకింగ్ స్టార్ట్స్ న‌వ్ ` అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే ఈసారి ఏదో పెద్దదే జరగబోతున్నట్లు అర్థమవుతోంది.

నిజానికి విక్రమ్ తన స్థాయికి తగ్గ స్క్రిప్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించినా.. అవి విక్రమ్ వ్యక్తిగత మాస్ ఇమేజ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టలేకపోయాయనే చెప్పాలి. అందుకే ఈసారి ఆనంద్ శంకర్ ఎంచుకున్న ఈ విభిన్నమైన కథ విక్రమ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. విక్రమ్ వంటి నటుడికి కావాల్సింది హీరోయిక్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే బలమైన కథనం.. అది ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్లు టీజర్ హింట్ ఇస్తోంది.

సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలంగా నిలవగా.. ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆ మూడ్‌ను పక్కాగా ఎలివేట్ చేసింది. విజువల్స్, కలర్ గ్రేడింగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. 2026 మే లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం విక్రమ్ గత చిత్రం `వీర ధీర సూరన్: పార్ట్ 2` తర్వాత వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్.

చియాన్ ఈసారి ఏదో కొత్త‌గా వండుతున్నాడు. ఈసారి ఏం వండినా వ్య‌క్తిగ‌త హీరోయిక్ ఇమేజ్ ని పాన్ ఇండియాలోకి పెంచే క‌థ‌ను ఎంచుకోవాలి.. బాక్సాఫీస్ వ‌ద్ద అత‌డికి విజ‌యం చాలా కీలకం. అయితే విక్రమ్ తన నటనలో చూపించే వైవిధ్యం ఈసారి కూడా వర్కవుట్ అయితే `చియాన్ 63` పాన్ ఇండియా మార్కెట్‌లో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం. ఒక సాదాసీదా వంటవాడు అత్యంత ప్రమాదకరంగా ఎలా మారుతాడు? తన శత్రువులను ఎలా 'వండుతాడు'? అనే కథాంశం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


Full View


Tags:    

Similar News