మెగా ఫ్యామిలీ నుంచి పిఠాపురం మిస్సైంది వీళ్లిద్ద‌రే!

మ‌రి పిఠాపురం మిస్సైన మెగా హీరోలు ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తుంది.

Update: 2024-05-12 05:28 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజ‌క వ‌ర్గం నిన్న‌..మొన్న‌టి వ‌ర‌కూ ఎలా ఉందో తెలిసిందే. ఓవైపు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్లు..మ‌రోవైపు సీరియ‌ల్ఆర్టిస్టులు..ఇంకోవైపు మెగా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యుల‌తో పిఠాపురం క‌ళ‌క‌ళ‌లాడింది. ఎన్న‌డు క‌నిపించ‌నంత జోష్ నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల్లో ముందుగా వ‌రుణ్ తేజ్ రంగంలోకి దిగ‌డం అభిమానుల్లో ఉత్సాహం నిండింది. అటుపై మెగా అల్లుళ్లు వైష్ణ‌వ్ తేజ్...సాయితేజ్ లు కూడా పాల్గొన్నారు.

వారితో పాటు నాగ‌బాబు...ఆయ‌న భార్య ప‌ద్మ‌జ కూడా ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇక చివ‌రిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..ఆయ‌న త‌ల్లి సురేఖ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. చివ‌రి రోజు ప్ర‌చారంలో ఇద్ద‌రు పాల్గొని అభిమానుల్లో మ‌రింత జోష్ నింపారు. నేరుగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగంలోకి దిగ‌డంతో పిఠాపురం మ‌రింత రంగుల మ‌యంగా మారింది. వారితోపాటు అల్లు అర‌వింద్ కూడా పాల్గొన్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం దిగారు.

Read more!

మ‌రి పిఠాపురం మిస్సైన మెగా హీరోలు ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తుంది. తొలుత నిన్న‌టి రోజున చిరంజీవి కూడా వ‌స్తార‌ని ప్ర‌చారం సాగింది గానీ..చివ‌రి నిమిషంలో చిరు వెన‌క్కి త‌గ్గారు. స‌రిగ్గా నిన్న‌టి రోజున బ‌న్నీ నంద్యాల వైకాపా అభ్య‌ర్ధి త‌రుపున ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని..స్నేహితులు ఏ పార్టీలో ఉన్న మ‌ద్ద‌తిస్తాన‌ని బ‌న్నీ స్పందించ‌డంతో! ఇది కాస్త మెగా అభిమానుల్లో కాస్త క‌ల‌వ‌రంగా మారినా! బ‌న్ని వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాన్నిగౌర‌వించాల్సిందే కాబ‌ట్టి త‌ప్ప‌లేదు.

బ‌న్నీ గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌రుపున ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిదే. అప్ప‌టి ఎన్నిక‌ల్లో అల్లు అర‌వింద్ అన‌కాపల్లి నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీలో ఉండ‌టంతో దాదాపు నియోజ‌క వ‌ర్గాల‌తో పాటు చాలా గ్రామాలు కూడా క‌వ‌ర్ చేసారు. మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నియోజ‌క వ‌ర్గాలు కావ‌డంతో ప్ర‌చారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గున్నారు. కానీ ఈసారి జ‌న‌సేన త‌రుపున మాత్రం పిఠాపురం నుంచి ఆ ఛాన్స్ తీసుకోలేదు.

Tags:    

Similar News