MSG నాన్ స్టాప్ రికార్డుల వేట.. మండే టెస్ట్ కూడా పాస్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. ప్రీమియర్స్ నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకొని, రెండో వారంలో ఇప్పుడు అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. రీసెంట్ గా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో వారంలో ఆ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత ఏడో రోజు (జనవరి 18) తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ షేర్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ పేర్కొన్నారు. అదే సమయంలో సోమవారం వసూళ్లను కలుపుకొని ‘మన శంకర వరప్రసాద్ గారు మూవీ రూ.300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ సినిమా సంక్రాంతికి వస్తున్నాం (రూ.303 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది.
దీంతో వరుసగా రెండేళ్లలో బ్యాక్ టూ బ్యాక్ రెండు రూ.300 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి అరుదైన ఘనత అందుకున్నారు. తాజాగా రూ.300కోట్ల క్లబ్ లో చేరిన విషయాన్ని చెబుతూ చిరు కొడితే బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటూ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది.
అదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే మూడు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. దీంతో చిరంజీవి కెరీర్ లో అమెరికాలో మూడు మిలియన్ డాలర్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. రాబోయే రోజుల్లో యూఎస్ఏలో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని క్లియర్ గా తెలుస్తోంది.
ఇక వీక్ డేస్ లో కూడా మన శంకర వరప్రసాద్ ఊహించని రీతిలో రాణిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా చోట్ల సోమవారం నాడు హౌస్ ఫుల్ బోర్డు కనిపించాయి. ఫెస్టివల్ మూడ్ అయిపోయినా.. మండే వసూళ్లు సాలిడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీక్ డేస్ టెస్ట్ కూడా సినిమా పాస్ అయినట్లే. మరి రికార్డుల వేట కొనసాగిస్తున్న MSG పుల్ రన్ లో ఎన్ని కోట్లు సాధిస్తుందో వేచి చూడాలి