నాలో సగం పవిత్ర.. ఆమె నా లక్కీ ఛార్మ్ - వీకే నరేష్
బాలనటుడిగా కెరియర్ ఆరంభించి.. 1982లో తన తల్లి, దివంగ దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వంలో 'ప్రేమ సంకెళ్లు' అనే చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు వీకే నరేష్.;
బాలనటుడిగా కెరియర్ ఆరంభించి.. 1982లో తన తల్లి, దివంగ దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వంలో 'ప్రేమ సంకెళ్లు' అనే చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు వీకే నరేష్. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నరేష్. ఆ తరువాత 'జంబలకడి పంబ' అనే చిత్రంతో.. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ల సాధించిన కామెడీ చిత్రంగా నిలిచి తన అద్భుతమైన నటనతో హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు నరేష్. అలాంటి ఈయన గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ముఖ్యంగా హీరోలకు తండ్రిగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వీకే నరేష్ తాజాగా లీడ్ రోల్ పోషిస్తూ నటిస్తున్న చిత్రం 'శుభకృత నామ సంవత్సరం'. పాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం నుండి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న నరేష్.. తన ప్రేయసి పవిత్ర లోకేష్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పైగా ఇదే కార్యక్రమంలో అటు పవిత్ర లోకేష్ కూడా నరేష్ పై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
శుభకృత నామ సంవత్సరం మూవీ గ్లింప్స్ రిలీజ్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ.." పవిత్ర లోకేష్ నా జీవితంలోకి వచ్చాక అసలైన సక్సెస్ ఏంటో చూస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పవిత్ర లోకేష్. ఆమె నా జీవితంలో సగం. నా లక్కీ ఛార్మ్ " అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ఇదే ఈవెంట్లో పవిత్ర లోకేష్.. నరేష్ గురించి మాట్లాడుతూ.. "54 సంవత్సరాల కెరియర్ ఆయనది. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను కలిసి జీవించడం అనేది నా అదృష్టం. ఆయన రోజులో చాలా బిజీగా ఉంటారు. ఆయనతో మాట్లాడేందుకు కూడా సమయం ఉండదు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ఆయన నాకు కేవలం 30 నిమిషాలు మాత్రమే తన సమయాన్ని కేటాయిస్తారు. అంత ఫుల్ బిజీగా ఉంటారు
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను" అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది పవిత్ర లోకేష్. ఇకపోతే తనకు తెలుగు భాష పై మక్కువ ఉందని.. ఆ భాష మరింత స్పష్టంగా మాట్లాడడానికి నరేష్ సహాయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అటు నరేష్ గురించి పవిత్ర ఇటు పవిత్ర గురించి నరేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నరేష్ హీరోగా నటిస్తున్న ఈ శుభకృత నామ సంవత్సరం సినిమా విషయానికి వస్తే నరేష్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా.. ధనుంజయ, ప్రకృతి జంటగా నటించారు. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధా శ్రీనివాస్ సంగీతం అందించారు. డిఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న నరేష్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.