స్టన్నింగ్ లుక్ లో సెగలు పుట్టిస్తున్న రాశీ ఖన్నా!
ఇకపోతే వరుసగా చిత్రాలు చేస్తోంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అయితే లభించడం లేదు.;
రాశీ ఖన్నా.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యువత ఫేవరెట్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈ సుందరి.. తొలిసారి 2013లో విడుదలైన 'మద్రాస్ కెఫే' అనే అని హిందీ చిత్రంలో భారత ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబీ సింగ్ పాత్ర ద్వారా సినీ రంగా ప్రవేశం చేసింది. రూబీ సింగ్ పాత్రలో నటించడానికి ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది రాశి ఖన్నా. తెలుగులో తొలిసారి అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీగా నిలిచిన 'మనం' సినిమాలో చిన్న పాత్ర పోషించి తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ ఒక్క పాత్ర ఈమెకు హీరోయిన్గా అవకాశం అందేలా చేసింది. అలా తొలిసారి 'ఊహలు గుసగుసలాడే' అనే సినిమాలో శ్రీ సాయి శిరీష ప్రభావతి అనే పాత్ర పోషించి తన నటనతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా హీరోయిన్గా మంచి పేరు దక్కించుకుంది.. ఈ సినిమా తర్వాత వరుసగా జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీం , హైపర్ , జై లవకుశ, రాజా ది గ్రేట్, శ్రీనివాస కళ్యాణం ఇలా పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ్లో కూడా వరుస సినిమాలు చేసి మెప్పించింది.
ఇకపోతే వరుసగా చిత్రాలు చేస్తోంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అయితే లభించడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో శ్రీలీల మరో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు మరో తెలుగు చిత్రంలో నటిస్తున్న ఈమె అటు హిందీ ' నాగ్జిల్లా: నాగ్ లోక్ కా పెహ్లాకాంద్' అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్న ఒక హిందీ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే హిందీ వెబ్ సిరీస్ ఫర్జీ 2 లో కూడా రాశిఖన్నా నటిస్తోంది. షాహిద్ కపూర్ తో కలిసి ఈ సీక్వెల్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అంతేకాదు ఆర్ మాధవన్ తో కలిసి ఒక టైం ట్రావెల్ మూవీ చేస్తున్న ఈమె ఒక పంజాబీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
అలా ప్రస్తుతం వరుస చిత్రాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నా రాశీ ఖన్నా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను మెస్మరైజ్ చేశాయి . ముఖ్యంగా అందాలు ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్ లో భిన్నమైన ఫోజులిస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు అటు నెటిజన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.