10వ వివాహ వార్షికోత్సవం.. ఆసిన్ కి క్రేజీ విషెస్ చెప్పిన భర్త!
2000 సంవత్సరంలో ప్రముఖ హీరోయిన్స్ నయనతార, త్రిష గట్టి పోటీ ఇస్తున్న సమయంలో తన అద్భుతమైన నటనతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఆసిన్.;
2000 సంవత్సరంలో ప్రముఖ హీరోయిన్స్ నయనతార, త్రిష గట్టి పోటీ ఇస్తున్న సమయంలో తన అద్భుతమైన నటనతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఆసిన్. తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సూర్య హీరోగా నటించిన 'గజినీ' సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక తెలుగులో బాలయ్యతో లక్ష్మీనరసింహ సినిమాలో కారప్పొడిగా మరింత క్రేజ్ అందుకుంది. ఇక తెలుగులో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శివమణి , ఘర్షణ , అన్నవరం వంటి చిత్రాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకుంది.
అలా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆసిన్.. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2016 జనవరి 19న ఢిల్లీలో మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్, తన ప్రియుడు రాహుల్ శర్మతో ఉదయం క్యాథలిక్ పద్ధతిలో.. సాయంత్రం హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఇక వీరి పెళ్లి తర్వాత ఏడాదికి ఆరిన్ అనే కూతురు కూడా జన్మించింది. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. అటు సినిమా ఈవెంట్లలో కానీ యాడ్స్ కానీ.. ఇలా ఎందులో కూడా కనిపించలేదు. ముఖ్యంగా భర్తతో కలిసి కూడా బయట కనిపించకుండా దాంపత్య జీవితాన్ని గడిపేస్తోంది.
అలాంటి ఈమె పెళ్లి జరిగి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈమె భర్త రాహుల్ శర్మ అరుదైన పెళ్లి నాటి ఫోటోలను పంచుకోవడమే కాకుండా ఆకట్టుకునేలా క్రేజీ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పదేళ్ల తమ వైవాహిక బంధానికి శుభాకాంక్షలు చెబుతూ తమ పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిన్ పెళ్లికూతురు గెటప్ లో క్యాథలిక్ పద్ధతిలో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. "ఆసిన్ నా జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలో కో- ఫౌండర్ గా నిలిచింది. ఆమె లైఫ్ లో నేను కో-స్టార్ గా ఉండడం అనేది నా అదృష్టం. మన ఇంటిని , నా మనసుని హై గ్రోత్ స్టార్టప్ లా నడిపించు" అంటూ ఆసిన్ ను ఉద్దేశించి రాహుల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక ఇదే సమయంలో ఆసిన్ కూడా తన కూతురు ఆరిన్ ఇసుకపై రాసిన అక్షరాలను షేర్ చేస్తూ.. అందులో తన పేరు మొదటి అక్షరం.. భర్త పేరు మొదటి అక్షరాలను కలుపుతూ ఆరిన్ గీసిన అక్షరాలను పంచుకుంటూ.. "10 ఇయర్స్ అండ్ కౌంటింగ్" అంటూ హృదయాన్ని తాకేలా ఒక క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే పదేళ్ల వివాహక వార్షికోత్సవం సందర్భంగా ఇన్నాళ్లకు మళ్ళీ కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా ఒకవైపు నయనతార , త్రిషలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదే సమయంలో ఆసిన్ ఫోటో కూడా బయటకు రావడం.. పైగా వీరు ముగ్గురు కలిసి దుబాయిలో ఎంజాయ్ చేస్తున్నట్టు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆసిన్ పంచుకోవడంతో.. 2000 సంవత్సరపు హీరోయిన్స్ ఒకే చోట చేరారు.. ఇది కదా అరుదైన ఫోటో.. ఇది అభిమానులకు ఒక మధురమైన సర్ప్రైజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఆసిన్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.