రెడ్ చీరలో ఘాటు అందాలు ఒలకబోస్తున్న సారా అర్జున్!
ఒకప్పుడు ముద్దు ముద్దు మాటలతో.. అమాయకపు మోముతో చూడగానే మనసుకు హత్తుకునేలా అందరినీ ఆకర్షించింది సారా అర్జున్.;
ఒకప్పుడు ముద్దు ముద్దు మాటలతో.. అమాయకపు మోముతో చూడగానే మనసుకు హత్తుకునేలా అందరినీ ఆకర్షించింది సారా అర్జున్. తమిళ్లో విక్రమ్ హీరోగా నటించిన 'థైవ తిరుమల్' అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'నాన్న' పేరిట రిలీజ్ చేసి.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఈ చిన్నారి. తన అద్భుతమైన నటనతో తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ భాష చిత్రాలలో బాలనటిగా అనేక సినిమాలు చేసి మెప్పించింది. 2015లో 'దాగుడుమూత దండాకోర్ ' అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా మరో అద్భుతమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది సారా అర్జున్.
అలాంటి ఈమె కొంతకాలం తర్వాత ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ 1&2 చిత్రాలతో నటిగా కెరియర్ ను ఆరంభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ యుక్త వయసు పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె తాజాగా రణవీర్ సింగ్ హీరోగా.. ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్యథార్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా ద్వారా కథానాయికగా తొలిసారి నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇందులో తన మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ చూసి, ఆ చిన్నారి ఈమేనా అంటూ అందరూ నోరెళ్ళబెట్టేలా చేసింది. ముఖ్యంగా ఈ ఒక్క సినిమా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో లైమ్ లైటు లోకి రావడమే కాకుండా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్గా ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది సారా అర్జున్.
ఇందులో తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె తాజాగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న 'యుఫోరియా' అనే సినిమాలో నటిస్తోంది. ఇదివరకే గుణశేఖర్ సమంతతో శాకుంతలం సినిమా చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఇక ఇప్పుడు నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ యుఫోరియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో సారా అర్జున్ ప్రధాన పాత్రధారిగా నటిస్తోంది.
ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో మరొకవైపు తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది సారా అర్జున్. ఇదిలా ఉండగా.. యుఫోరియా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన అందాలతో ఆకట్టుకున్న ఈమె.. ఆ ఫోటోలను ఇప్పుడు తన అధికారిక ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అందులో రెడ్ కలర్ చీర కట్టుకొని తన అందాలను హైలెట్ చేస్తూ సారా అర్జున్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టులో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే సారా అర్జున్ హీరోయిన్ గా అవతరించిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఇలా గ్లామర్ ఒలకబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక అమ్మడి అందానికి ఫిదా అయిన అభిమానులు పలు రకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.