చిరు ఇంట మెగా దివాళీ సెలబ్రేషన్స్.. సందడి చేసిన తారలు!

ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి పంచుకున్నారు. "నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.;

Update: 2025-10-20 15:37 GMT

కాలం మారుతున్న కొద్దీ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని పండుగలను సెలబ్రేట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి ఒకప్పుడు బాలీవుడ్ లోనే ఇలా ఎక్కువగా పార్టీలు, సెలబ్రేషన్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి టాలీవుడ్ కి కూడా పాకిపోయింది. టాలీవుడ్ తారలు కూడా ఒకరిని మించి మరొకరు గ్రాండ్ గా పార్టీలు అరేంజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న టాలీవుడ్ లో నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న బండ్ల గణేష్ టాలీవుడ్ సెలబ్రిటీలకు చాలా గ్రాండ్ గా దీపావళి పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో సెలబ్రిటీల కోసం స్పెషల్ గా దీపావళి పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన తోటి నటులు , స్నేహితులు అయిన నాగార్జున , వెంకటేష్ లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతేకాదు ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా హీరోయిన్ నయనతార కూడా దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలలో నాగార్జున, చిరంజీవి కుర్తాలు ధరించి చాలా హుందాగా కనిపించగా.. అటు చిరంజీవి భార్య సురేఖ, నాగార్జున భార్య అమల, నయనతార సింపుల్ శారీస్ తో తమ మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేశారు. వెంకటేష్ ఎప్పటిలాగే షర్ట్ అండ్ ఫ్యాంట్ పైన కోట్ ధరించి తన లుక్ ను కంప్లీట్ చేసుకున్నారు

 

ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి పంచుకున్నారు. "నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందముతో నింపుతాయి. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు , ఐక్యతను గుర్తు చేస్తాయి" అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు చిరంజీవి.

తాజాగా చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో కింగ్ నాగార్జున తన భార్య అమల అలాగే నయనతార , విక్టరీ వెంకటేష్ పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏదేమైనా ఇలా సెలబ్రిటీలు ఒకరికొకరు చాలా గ్రాండ్ గా కలుసుకుంటూ ఫ్యామిలీ టైమ్ ని ఎంజాయ్ చేయడం చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు తమ అభిమాన హీరోలు అందరినీ ఒకే చోట చూడడం చూసి ఈ దృశ్యం ఎంత కమనీయం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా పూర్తి చేశారు. కానీ విడుదలకు నోచుకోలేదు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమా ప్రకటించారు. ఇందులో ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ ను హీరోయిన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags:    

Similar News