• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ కు మరో తమ్ముడు

మెగాస్టార్ కు మరో తమ్ముడు

| మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-05-10 04:36 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక విశ్వంభర మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యారు. నిజానికి చిరంజీవి ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ లుక్ మెయింటేన్ చేస్తూ ఉంటారు.

రాజకీయాలలో ఉన్నప్పుడు లుక్ పైన పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. మరల సినిమాలలో బిజీ అయ్యాక వర్క్ అవుట్ లు చేసి స్లిమ్ అయ్యి యంగ్ లుక్ లోకి వచ్చారు. విశ్వంభర సినిమా కోసం అయితే మరింత యంగ్ లుక్ లో మేకోవర్ అయ్యారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే లుక్ తో చిరంజీవి కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో పద్మవిభూషణ్ అవార్డు స్వీకరణ కోసం కుటుంబసమేతంగా మెగాస్టార్ హాజరయ్యారు.

పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అవార్డు గ్రహీతలకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లూ కలర్ షూట్, రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్ లో ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోలో ఇద్దరు తండ్రికొడుకుల్లా కంటే అన్నదమ్ములు మాదిరిగా కనిపిస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చిరంజీవి యంగ్ లుక్ లో రామ్ చరణ్ కి పోటీ ఇచ్చేలా స్టైలిష్ గా ఉన్నారని మెగా అభిమానులు అంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ కూడా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో స్టైలిష్ గా కనువిందు చేశాడు.

గతంలో పవన్ కళ్యాణ్ కూడా తనకు చరణ్ తమ్ముడు లాంటి వాడు అంటూ చేసిన కామెంట్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక మెగాస్టార్ ఇప్పుడు ఆ ఫొటో ద్వారా చరణ్ కు కూడా అన్నయ్య అని చెప్పకనే చెబుతున్నారు అనిపిస్తుంది. ఇక వీరి కలయికలో మరో మంచి సినిమా పడితే చూడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఫోటోని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాగే నార్త్ ఇండియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. చిరంజీవి విశ్వంభరతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధం అవుతూ ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీని రామ్ చరణ్ చేస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Tags:    
  • Padmavibhushan 
  • Chiranjeevi 
  • Ramcharan 
  • Tollywood 
  • Padmaawards 
  • Megastar 
  • Chiranjeevicharan 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS