• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ ఫైట్: చిరంజీవి Vs...

బిగ్ ఫైట్: చిరంజీవి Vs బాలకృష్ణ

| అయితే సీనియర్ హీరోలిద్దరూ మరోసారి పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-04-09 02:30 GMT

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ గతంలో అనేక సందర్భాల్లో ఒకే సీజన్ లో పోటీ పడి, సినీ అభిమానులకు కావల్సినంత వినోదాన్ని అందించారు. కొన్నిసార్లు చిరు పైచేయి సాధిస్తే, మరికొన్ని సందర్భాల్లో బాలయ్య పైచేయి సాధించారు. అయితే సీనియర్ హీరోలిద్దరూ మరోసారి పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ ప్రస్తుతం 'NBK 109' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కెఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. మరోవైపు చిరంజీవి ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో 'విశ్వంభర' అనే మెగా సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను రాబోయే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వస్తాయని టాక్ వినిపిస్తోంది.

సినిమాలకి అతి పెద్ద సీజన్ గా భావించే సంక్రాంతికి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ ఉంటుంది. 2025 ఫెస్టివల్ సీజన్ కోసం ఇప్పటి నుంచే పోటీ ఎక్కువైంది. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రాన్ని వచ్చే పొంగల్ కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు గతేడాదే ప్రకటించారు. బాలకృష్ణ 109వ సినిమాని ఈ ఏడాది దసరాకి విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ అదే టైంలో మరికొన్ని పెద్ద సినిమాల రిలీజులు ప్లాన్ చేసిన నేపథ్యంలో, NBK 109 మూవీని సంక్రాంతి రేసులో నిలిపే ఛాన్స్ వుందని అంటున్నారు.

గత దశాబ్ద కాలంలో చిరు, బాలయ్యలు రెండు సార్లు సంక్రాంతి బాక్సాఫీసు దగ్గర పోటీ పడ్డారు. 2017 జనవరిలో 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నెం.150' సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. ఇద్దరూ సక్సెస్ అందుకున్నారు కానీ, చిరంజీవి కాస్త పైచెయ్యి సాధించారు. ఇదే విధంగా గతేడాది పొంగల్ కి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ఒక రోజు గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చాయి. రెండూ హిట్టయ్యాయి కానీ, ఈసారి కూడా మెగాస్టారే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందుకే మరోసారి వీరిద్దరూ పెద్ద పండక్కి వస్తారని వార్తలు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న చిత్రం 'NBK 109'. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి 'భోళా శంకర్' తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు 'విశ్వంభర' పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. వేర్వేరు జోనర్స్ లో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు కోసం ఇరు వర్గాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఇద్దరు సీనియర్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • TeluguFilmIndustry 
  • Sankranthiseason 
  • MovieReleases 
  • KhaidiNo150 
  • GouthamiputraSatakarni 
  • WaltairVeerayya 
  • VeeraSimhaReddy 
  • Vishwambrara 
  • Chiranjeevi 
  • BalaKrishna 
  • Vishwambhara 
  • NBK109 
  • Bobby 
  • BoxOffice 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS