'విశ్వంభర' లేట్.. అనుభవలేమి కారణం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆరంభంలోనే ప్రారంభం అయిన విశ్వంభర సినిమా ముందస్తుగా చేసిన ప్రకటన ప్రకారం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు విశ్వంభర సినిమా విడుదల కాలేదు. త్వరలో విడుదల కాబోతుందా అంటే అది కూడా క్లారిటీ లేదు. ఒక సినిమా విడుదల తేదీ ప్రకటిస్తే ఆ తేదీకి రాకున్నా ఆ తేదీకి దగ్గరగా ఉన్న తేదీకే అంటే రెండు మూడు నెలల గ్యాప్‌లోనే రావాల్సి ఉంటుంది. విశ్వంభర సైతం సంక్రాంతికి మిస్ అయింది కనుక 2025 సమ్మర్‌కే వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
విశ్వంభర సినిమా ఆలస్యంకు కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్ అనే విషయం తెల్సిందే. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మహా అయితే వారం రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది. అది కూడా ఎప్పుడో పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను కలిగి ఉందట. దాంతో సినిమాకు ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకోసం ఇండియన్ టీం సరిపోవడం లేదు. అందుకే విదేశాల్లో ఉన్న వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో ఈ సినిమా కోసం వర్క్ చేయిస్తున్నారు.
బింబిసారతో హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట వెంటనే చిరంజీవి వంటి మెగాస్టార్‌తో అతిపెద్ద సోషియో ఫాంటసీ సినిమాను తీసే అవకాశం దక్కింది. విశ్వంభర సినిమాను చేసే అవకాశం వశిష్టకు దక్కడం అనేది కచ్చితంగా చాలా పెద్ద రిస్క్. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అతడి మీద ఒత్తిడి ఓ రేంజ్‌లో ఉంది. ఆ మధ్య సినిమాను ప్రకటించడానికి వదిలిన గ్లిమ్స్ వీడియోకు వినియోగిచిన గ్రాఫిక్స్ వర్క్ పై ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలిసిందే. అందుకే సినిమాలో అయినా క్వాలిటీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దర్శకుడు వశిష్ట గతంలో ఈ స్థాయి వీఎఫెక్స్ వర్క్ చేసిందే లేదు.
వశిష్టకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయమై పెద్దగా అవగాహణ లేకపోవడంతో విశ్వంభర సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది అనేది చాలా మంది అభిప్రాయం. విశ్వంభర సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే వీఎఫ్ఎక్స్ వర్క్ సైతం నడుస్తూనే ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో విశ్వంభర సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా ఎంత ఉంది అనే విషయంలో దర్శకుడికి, ఇతర యూనిట్ సభ్యులకు ఒక స్పష్టత లేనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమా విడుదల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు అంటూ చాలా మంది అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట ఇప్పటికైనా విశ్వంభర సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఏడాదిలో విశ్వంభరతో మెగా ఫ్యాన్స్ ముందుకు మెగాస్టార్ వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.