20ఏళ్ల అమ్మాయికి 71 ఏళ్ల ముసలోడు ముద్దు.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం..

దీనికి రాకేష్ బేడీ స్పందిస్తూ.. "ఇది చాలా తెలివి తక్కువ పని. సారా వయసులో నాకంటే చాలా చిన్నది.;

Update: 2025-12-19 06:02 GMT

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏ చిన్న విషయాన్నైనా సరే ఇట్టే భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తూ.. తండ్రీ కూతుళ్ళ మధ్య కూడా అసభ్యకర సంబంధాలను క్రియేట్ చేస్తూ వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలపై కొంతమంది స్పందిస్తే.. మరికొంతమంది సైలెంట్ గా చూసి చూడనట్టు ఉండిపోతున్నారు. కానీ తాను మాత్రం అలా ఉండలేనని తండ్రి కూతుళ్ళ లాంటి తమ మధ్య ఇలాంటి అనుమానపు అపోహలు సృష్టించడం ఏమాత్రం కరెక్ట్ గా లేదు అని ఆయన తెలిపారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఆదిత్యాధార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ధురంధర్. ఈ సినిమాలో 71 ఏళ్ల రాకేష్ బేడీకి 20 సంవత్సరాల వయసున్న సారా అర్జున్ కూతురి పాత్రలో నటించింది.. నవంబర్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్5లో వేదికపైకి సారా రాగా .. ఎదురెళ్లి ఆమెను పలకరించిన రాకేష్...ఆమెను హగ్ చేసుకొని...ఆమె భుజానికి ముద్దు పెట్టగా.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. చాలామంది దీనిపై విమర్శలు గుప్పించారు.. యువతిపై వృద్ధుడి ప్రేమ అంటూ పలు రకాల కామెంట్లు చేశారు.

దీనికి రాకేష్ బేడీ స్పందిస్తూ.. "ఇది చాలా తెలివి తక్కువ పని. సారా వయసులో నాకంటే చాలా చిన్నది. షూటింగ్ సమయంలో కూడా మేమిద్దరం సొంత కుటుంబ వ్యక్తుల్లాగా ఉండేవాళ్ళం. ప్రతి విషయాన్ని ఆమె నాతో పంచుకునేది. అటు తెరపై కూడా మా అనుబంధం మీకు కనిపించింది. అందుకే ఆరోజు ఆమె వేదిక పైకి రాగానే దగ్గరికి తీసుకున్నాను. యువతిపై వృద్ధుడి ప్రేమ అంటూ కొంతమంది తప్పుగా రాశారు. తండ్రికి కుమార్తె పై ఉన్న ప్రేమను ఎవరు చూడలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించడం పద్ధతిగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ బేడీ.

సినిమా విషయానికి వస్తే.. రణవీర్ సింగ్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఒక ఇండియాలోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. దీనికి తోడు టి20 మ్యాచ్ లక్నోలో జరగకముందే టీం ఇండియా ప్లేయర్లు ఒక థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకుని మరీ సినిమా చూసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News