కొడుకు సినిమా ఈవెంట్ కు రానన్న శ్రీకాంత్.. ఎందుకంటే..
నాలుగేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందD చిత్రంతో మంచి గుర్తింపు పొందిన రోషన్ మేక.. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.;
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుద్రమదేవి మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రోషన్.. నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా మారారు. ఆ చిత్రానికి గాను ఆయన సైమా (SIIMA) ఉత్తమ తొలి చిత్ర నటుడి అవార్డును అందుకుని మెప్పించారు.
నాలుగేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందD చిత్రంతో మంచి గుర్తింపు పొందిన రోషన్ మేక.. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1948 బ్యాక్ డ్యాప్ తో ఫుట్ బాల్ బేస్డ్ స్టోరీతో గ్రాండ్ గా రూపొందిన ఆ మూవీతో డిసెంబర్ 25వ తేదీన థియేటర్స్ లో రానున్నారు యంగ్ హీరో రోషన్.
ఇప్పటికే సినిమా విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఛాంపియన్ పై ఆసక్తి మరింత పెరిగింది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచింది. కచ్చితంగా రోషన్ హిట్ అందుకుంటారనే హైప్ ను నెలకొల్పింది. సినిమాలో యాక్టింగ్ తో ప్రశంసలు అందుకోనున్నారని కూడా టాక్ వస్తోంది.
అయితే హీరోగా చిన్న గ్యాప్ తర్వాత రోషన్.. ఇప్పుడు వివిధ సినిమాలను లైన్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వరుస హిట్ అందుకుని.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే శ్రీకాంత్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్, ఐడెంటిటీ ఉందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తండ్రి ఐడెంటిటీనే తన ఐడెంటిటీ అని చెబుతున్నారు రోషన్ మేక. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఆ కార్యక్రమానికి శ్రీకాంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. కానీ ఆయన ముందు రానున్నారట. ఆ విషయాన్ని శ్రీకాంత్ వెల్లడించారు. వేదికపై మాట్లాడుతూ.. తండ్రి ఐడెంటిటీనే తన ఐడెంటిటీ అని రోషన్ మేక చెప్పారు.
"నిజానికి ఈవెంట్ కు నాన్న రాను అన్నారు. నీకు ఎప్పుడు సొంత ఐడెంటిటీ ఉండాలని నాతో చెప్పారు. నేను వస్తే మళ్లీ మొత్తం డైవర్ట్ అవుతుందని అని తెలిపారు. కానీ నేను మాత్రం రమ్మని చెప్పా" అని రోషన్ తెలిపారు. నాన్న ఐడెంటిటీనే తనకు కూడా అని చెప్పడానికి గర్వంగా ఉందని అన్నారు. అలాంటివి ఎప్పుడూ పెట్టుకోకు నాన్న అంటూ శ్రీకాంత్ తో చెప్పారు. అయితే శ్రీకాంత్, ఊహల పెద్ద కొడుకైన రోషన్.. ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.