'ధురంధర్' పాక్‌లో బ్లాక్ బస్టర్.. కానీ అదే ట్విస్ట్!
పైరసీ వెర్షన్ ను ఇప్పటికే రికార్డ్ స్థాయిలో డౌన్ లోడ్ చేసుకుని ఈ సినిమాని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారట.;
కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య ఆగని యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్కోసారి నేరుగా యుద్ధం చేస్తున్న పాక్ ఏళ్ల తరబడి టెర్రరిస్టులని అడ్డం పెట్టుకుని ఇండియాపై రహస్య యుద్ధం చేస్తూ తన సైకోయిజాన్ని చాటుకుంటోంది. ఇలాంటి పరిణామాల కారణంగా కొన్ని దశాబ్దాలుగా భారత్ - పాక్ మధ్య సత్సంబంధాలు లేవు. అయినా సరే అక్కడ బాలీవుడ్ సినిమాలకు మాత్రం మంచి మార్కెట్ ఉంది. కారణం హీరోలు ఖాన్‌లు కావడం.
ఖాన్‌ల త్రయం షారుక్ ఖాన్, ఆమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్‌లు నటించిన సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతూ కాసులు వర్షం కురిపిస్తారు. అయితే ఇటీవల పహల్గావ్ ఉగ్రదాడి తరువాత ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తడంతో అప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలేవీ పాక్‌లో రిలీజ్ కావడం లేదు. అంతే కాకుండా ఆ దేశానికి సంబంధించిన నటీనటుల్ని, టెక్నీషియన్‌లని కూడా బాలీవుడ్ మేకర్స్ తమ సినిమాల కోసం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మూవీపాక్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అదే `ధురంధర్`. రణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్యధర్ రూపొందించిన స్పై యాక్షన్ డ్రామా ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది పాకిస్థాన్‌గా మారింది. పాకిస్థాన్‌లోకి ఎంటరైన ఇండియన్ రా ఏజెంట్ నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కిన ఈ సినిమా మొత్తం పాక్ చుట్టే తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రేక్షకులు ఈ సినిమాకు అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. అయితే థియేటర్లలో అనుకుంటే పొరబడినట్టే. హిందీ సినిమాలేవీ ఇప్పుడు అక్కడ రిలీజ్‌కు నోచుకోకపోవడంతో పాన్ ఆడియన్స్ `ధురంధర్` పైరసీ వెర్షన్‌ని ఎగబడి చూస్తున్నారట.
పైరసీ వెర్షన్ ను ఇప్పటికే రికార్డ్ స్థాయిలో డౌన్ లోడ్ చేసుకుని ఈ సినిమాని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పటి వరకు పాక్ లో ఈ సినిమా పైరసీ వెర్షన్‌ని 20 లక్షల పై చిలుకే డౌలోడ్ చేసుకున్నానని ఇన్ సైడ్ టాక్. పాకిస్థానీయులని విలన్‌లుగా చూపిస్తూ ప్రధాన కథ మొత్తం పాక్‌లోనే సాగినా ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగా చూస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ అంచనాల మధ్య రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లకు భిన్నంగా ఓ సిరీస్ తరహాలో విడుదలైని ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పై చిలుకు వసూళ్లని రాబట్టి సంచలనాలు సృష్టిస్తోంది.