చీరకట్టులో గ్లామర్ బ్యూటీ హొయలు..

అందులో భాగంగానే హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ కలిగిన ప్లెయిన్ ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్న ఈమె దీనికి కాంబినేషన్లో గోల్డెన్ కలర్ బ్లౌజ్ తో స్టైల్ చేసింది.;

Update: 2025-12-19 05:27 GMT

ప్రస్తుతం సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే రకరకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ తమ సినిమాను ఈ రకంగా ప్రమోట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అనన్య పాండే కూడా తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకట్టుకునే ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన అందంతో ఆకట్టుకున్న ఈమె చీర కట్టులో కూడా గ్లామర్ ఒలకబోస్తూ హొయలు పోయింది.

 

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అనన్య పాండే.. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో అనన్య పాండే జతకట్టింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ' అనే చిత్రంలో నటిస్తోంది.

 

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు పబ్లిక్ లో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈమె.. ఇటు సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

 

అందులో భాగంగానే హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ కలిగిన ప్లెయిన్ ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్న ఈమె దీనికి కాంబినేషన్లో గోల్డెన్ కలర్ బ్లౌజ్ తో స్టైల్ చేసింది. జుట్టును ఫ్రీగా వదిలేసిన ఈమె చేతులకు బ్యాంగిల్స్, చెవి దిద్దులతో పాటు నుదిటిన చిన్న బొట్టు పెట్టుకొని తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది.

 

చాలా రోజుల తర్వాత మళ్లీ చీర కట్టులో అనన్య కనిపించి.. తన అందాలతో ఆకట్టుకుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ట్రెండీగా తయారై అందరి హృదయాలను దోచుకుంటుంది అనన్య పాండే.

 

ఇదిలా ఉండగా అనన్య పాండేకి ఈసారి తెలుగులో మరో అవకాశం లభించినట్లు తెలుస్తోంది. ఇదివరకే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమాలో నటించి పరాభవాన్ని చవిచూసిన ఈమెకు ఇప్పుడు అఖిల్ లెనిన్ మూవీలో అవకాశం లభించినట్లు సమాచారం..మురళి కే కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న ఈ లెనిన్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మొదట శ్రీలీలాని అనుకోగా.. ఆ తర్వాత భాగ్యశ్రీని ఫైనల్ చేశారు. ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అయిన అనన్య పాండేని ఇందులో స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం మళ్లీ తెలుగులో అనన్యకు అవకాశాలు వచ్చినట్టే అని చెప్పవచ్చు.

Tags:    

Similar News