బిగ్ బాస్ 9.. డీమాన్ జర్నీలో ఇవి గమనించారా..?
రీతుతో అతని ఫ్రెండ్ షిప్ రీతు ఆట కన్నా డీమాన్ ఆట మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ఐతే ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుంచి డీమాన్ మరింత ఫోకస్ తో ఆట ఆడాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 జర్నీలను చూపిస్తూ వారు ఈ 100 డేస్ హౌస్ లో ఏం చేశారన్నది బిగ్ బాస్ తన మాటల్లో కూడా వెల్లడించారు. డీమాన్ పవన్ జర్నీ గురించి చెబుతూ కామనర్ గా వచ్చి సత్తా చాటాడని అన్నారు. సహనం మీ ఆయుధం అని టాస్క్ లల్లో మీరు ఎవరివైపు ఉంటే వారిదే విజయమని డీమాన్ కి మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక రీతు పేరు ప్రస్తావించకుండానే తనతో మీ స్నేహం ఆమె కోసం మీరు చేసిన సపోర్ట్ అందరికి నచ్చిందని అన్నారు బిగ్ బాస్.
కళ్యాణ్ తో అతను పోటీ పడిన తీరు..
ఇక డీమాన్ పవన్ జర్నీలో రీతుతో ట్రాక్ అంతా మరీ ఎక్కువ చూపించలేదు. హౌస్ లో అతను చేసిన అల్లరి టాస్క్ లల్లో డీమాన్ పవన్ చూపించిన తెగువ ఇవన్నీ జర్నీలో చూపించారు. ముఖ్యంగా కళ్యాణ్ తో అతను పోటీ పడిన తీరు కొన్నిచోట్ల గెలిచి.. మరికొన్నిచోట్ల ఓడిపోయిన సందర్భం ఇలా అన్నిటినీ కవర్ చేశారు. డీమాన్ సీజన్ మొదటి నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. ఐతే అతని ఫిజికల్ స్ట్రెంత్ కి తగిన అవకాశాలు రాలేదు.
రీతుతో అతని ఫ్రెండ్ షిప్ రీతు ఆట కన్నా డీమాన్ ఆట మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ఐతే ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుంచి డీమాన్ మరింత ఫోకస్ తో ఆట ఆడాడు. చివరి వారం పెడుతున్న ప్రతి టాస్క్ లో డీమాన్ అదరగొట్టేస్తున్నాడు. టాప్ 5లో ఉంటాడా లేడా అన్న పాయింట్ నుంచి టాప్ 5లో టాప్ 4గా తన పొజిషన్ సుస్థిరం చేసుకున్నాడు డీమాన్ పవన్.
డీమాన్ పవన్ ఫిజికల్ స్ట్రెంత్..
ఐతే డీమాన్ పవన్ ఫిజికల్ స్ట్రెంత్ తెలిసిన ఆటల్లో అతన్ని వేగాన్ని గుర్తించిన ఆడియన్స్ అతను టాప్ 4 కాదు టాప్ 3 ఇంకా పైనే ఉండాలని ఓట్లు వేస్తున్నారు. మరి ఫైనల్ ఓటింగ్ పొజిషన్ లో కచ్చితంగా మార్పులు ఉండేలా ఉన్నాయి. మరి డీమాన్ పవన్ ఫైనల్ ఎపిసోడ్ లో ఏ స్థానంలో ఉంటాడన్నది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.
బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్ జర్నీ చూపిస్తూ రీతుతో ఫ్రెండ్ షిప్ చూపించినా ఎక్కువ అది కాకుండా అతని టాస్క్ లల్లో ఆడింది.. మిగతా హౌస్ మేట్స్ తో కలిసి ఉన్నది చూపించారు. డీమాన్ పవన్ కూడా తన జర్నీ చూసుకున్నాక మిగతా నలుగురి హౌస్ మేట్స్ తో అదే విషయాన్ని చెప్పాడు. జర్నీలో రీతుని తక్కువ చూపించారని చెప్పాడు. సో ఇది కచ్చితంగా బిగ్ బాస్ డీమాన్ పవన్ కి చేసిన ఫేవరే అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఫైనల్ గా డీమాన్ కోసం సపోర్ట్ చేసే ఆడియన్స్ అతన్ని ఏ స్థానంలో ఉంచుతారన్నది ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.