మెగా 'విశ్వంభర' కోసం హాలీవుడ్‌..!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.;

Update: 2025-07-02 10:44 GMT

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అనౌన్స్‌మెంట్‌ టీజర్‌కి నెగటివ్‌ టాక్‌ రావడంతో పాటు, వీఎఫ్‌ఎక్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో విశ్వంభర సినిమా వీఎఫ్‌ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని మేకర్స్ భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే విశ్వంభర సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను కాస్త ఎక్కువ బడ్జెట్‌ అయినా పర్వాలేదు కానీ అద్భుతంగా ఉండాలని ప్లాన్‌ చేశారు. అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సినిమాలకు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేసిన ప్రముఖ కంపెనీకి అప్పగించారని తెలుస్తోంది.

సోషియో ఫాంటసీ మూవీ కనుక వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉంటే కచ్చితంగా విడుదల సమయంలో విమర్శలు రావడం ఖాయం. అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుని, సమయం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అనుకుని హాలీవుడ్‌ సంస్థకు అప్పగించారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ సంస్థ ఈ సినిమా వర్క్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఫైనల్‌ ఔట్‌ పుట్‌ వచ్చిన తర్వాత మాత్రమే సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు. బింబిసార వంటి విభిన్నమైన సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా చిరంజీవి సినిమా కావడంతో చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంభర సినిమా కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ లేదు. కానీ గతంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది అని మెగా ఫ్యాన్స్‌కి మేకర్స్‌ హామీ ఇస్తున్నారు.

ఈ సినిమాలో త్రిష కాకుండా పలువురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. వారు చిరంజీవికి చెల్లెలు పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రత్యేకమైన ఐటెం సాంగ్‌ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ నటి మౌని రాయ్‌ నటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. విశ్వంభర సినిమా విడుదల విషయంలో నెలకొన్ని సందిగ్దంను చిరంజీవి బర్త్‌డే సందర్భంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో విశ్వంభర సినిమా రిలీజ్‌ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, 2026 సంక్రాంతికి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా రాబోతుందని మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది.

Tags:    

Similar News