• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విశ్వంభర' రామ రామ...

'విశ్వంభర' రామ రామ సాంగ్.. సెన్సేషనల్ రికార్డ్!

| స్లోగా స్టార్ట్ అయిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మెగాస్టార్ మేనియాను మళ్ళీ రీడిఫైన్ చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-05-12 18:00 GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై అభిమానుల్లో ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి టీజర్‌ రూపంలో వచ్చిన ఫస్ట్ లుక్ మంచి స్పందన పొందింది. చిరంజీవి లుక్‌ కొత్తదనం, విజువల్స్ గ్రాండ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంతో తాజాగా విడుదలైన తొలి పాట ‘రామ రామ’ ఇప్పుడు ఓ పవర్‌ఫుల్ ట్రెండ్‌గా మారింది.

 

అందులోనూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే... మొదట ఈ పాటపై ఎలాంటి సెన్సేషన్ లేనట్టు కనిపించినా, ఆన్‌లైన్‌ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాజిటివ్ రిస్పాన్స్ వచ్చింది. స్లోగా స్టార్ట్ అయిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మెగాస్టార్ మేనియాను మళ్ళీ రీడిఫైన్ చేస్తోంది. అటు పాట విషయంలోనూ, ఇటు లిరిక్స్‌లోనూ అందరి హృదయాలను తాకిన మెసేజ్ ఉండటమే ఈ విజయానికి కారణమని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు.

ఈ పాటలో చిరంజీవి భక్తిభావం కలగలిసిన స్టెప్పులు, ఆయ‌న ముఖంలో ప్రతిబింబించే భావప్రకటన, స్క్రీన్‌పై ఆయన ఉన్నత స్థాయి ప్రెజెన్స్‌ అన్నీ కలసి పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. చిరు మాస్ మూమెంట్స్‌కి పూర్తి విరుద్ధంగా, ఆయనలోని భక్తివేదనను ఈ పాట వెలికితీసింది. ఇది ఒక యాక్షన్ స్టార్ నుంచి కనిపించే ఊహించని కోణం కావడంతో, ఈ డిఫరెంట్ ట్రాక్ మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది.

ఎంఎం కీరవాణి సంగీతం ఈ పాటలో మరో ఎత్తుకు ఎక్కింది. శంకర్ మహదేవన్ గొంతులో భక్తిరసాన్ని చిలికిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సంగీతం, ఆలాపనలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఒక భక్తిమయ దివ్య యాత్రను తలపిస్తున్నాయి. ‘విశ్వంభర’ సినిమా థీమ్‌కు అనుగుణంగా కీరవాణి ఈ పాటను అద్భుతంగా డిజైన్ చేశారని మ్యూజిక్ క్రిటిక్స్ చెబుతున్నారు.

ఈ పాటతో పాటు సినిమా గురించి ప్రేక్షకుల్లో కొత్త రకమైన ఆసక్తి మొదలైంది. ఇది పూర్తిగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో, చిరంజీవి తాజా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. నిర్మాతలు త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. రెండవ సింగిల్‌తో పాటు ట్రైలర్ కూడా సమ్మర్‌లోనే రానుందని బజ్.

#RamaRaama song from #Vishwambhara TRENDING on YouTube for music with 25 MILLION+ VIEWS ❤‍🔥Immerse in the divine trance 🏹✨▶️ https://t.co/23V6CKS0tpMusic by the Legendary @mmkeeravaani 🛐Lyrics by 'Saraswatiputra' @ramjowrites ✒️Sung by @Shankar_LiveChoreography by… pic.twitter.com/Mq8lBltYKn

— UV Creations (@UV_Creations) May 12, 2025
Tags:    
  • Chiranjeevi 
  • Vishwambhara 
  • RamaRaama 
  • MMKeeravaani 
  • ShankarMahadevan 
  • MegaStarChiranjeevi 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS