విశ్వంభర.. బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుందేంటి?
అయితే బయట ఎన్ని చర్చలు జరుగుతున్నా.. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమా పనులు మాత్రం ఆగడం లేదట.
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. షూటింగ్ దాదాపు పూర్తయిన ఆ సినిమాపై ఇప్పుడు సినిమా కంటే రిలీజ్ డేట్ చర్చే ఎక్కువగా వినిపిస్తోంది. ఎప్పుడు వస్తుంది? అసలు డిసెంబర్ కేనా? లేక 2027లోకి వెళ్తుందా? అనే డౌట్స్ కొనసాగుతున్నాయి. అయితే బయట ఎన్ని చర్చలు జరుగుతున్నా.. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమా పనులు మాత్రం ఆగడం లేదట.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సోషియో ఫాంటసీ మూవీకి విజువల్స్ చాలా కీలకం. అందుకే ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పైనే టీమ్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా తొందరపడకుండా ఫైనల్ అవుట్ పుట్ ను చెక్ చేసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు అనుకున్న రేంజ్ లో రావాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నట్లు టాక్.
అదే సమయంలో సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ హక్కుల విషయంలో కూడా డీల్ క్లోజ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించి మిగిలిన పనులపై టీమ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఇప్పుడు అందరి దృష్టి రిలీజ్ డేట్ పైనే ఉంది. ముందుగా 2027 సంక్రాంతి అనుకున్నా.. ఇప్పుడు 2026 చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన టీమ్‌లో ఉన్నట్లు సమాచారం.
డిసెంబర్ మొదటి వారాన్ని కూడా ఒక ఆప్షన్ గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు, ఫైనల్ అవుట్ పుట్ ఆధారంగానే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే చిరంజీవి నటిస్తున్న కాకా జనవరి 13న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో విశ్వంభర సంక్రాంతి బరిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. ఒకవేళ డిసెంబర్ రిలీజ్ కూడా సాధ్యం కాకపోతే.. సంక్రాంతి తర్వాత సమయం లేదా సమ్మర్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇక దర్శకుడు వశిష్ఠ ఇటీవల చేసిన కొన్ని పోస్టులు కూడా మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాలోని శివతత్వానికి సంబంధించిన ప్రమోషన్ మొదలవుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అంతా సిద్ధమయ్యే వరకు రిలీజ్ డేట్ ప్రకటించకుండా ఉండటమే టీమ్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఫైనల్ అవుట్ పుట్ పై చిరంజీవితో చర్చించిన తర్వాత టీజర్ తో పాటు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. అంటే బయట ఎంత చర్చ జరుగుతున్నా.. విశ్వంభర విషయంలో అసలు క్లారిటీ రావాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న పనులన్నీ చూస్తే.. రిలీజ్ కంటే ముందు సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని పక్కాగా సెట్ చేసుకునే పనిలో మూవీ టీమ్ ఉన్నట్లు అర్థమవుతోంది.