చిరు వెంకీ.. కామెడీ ఎలా ఉండబోతోంది?
ముఖ్యంగా చిరంజీవి- వెంకటేష్ మధ్య కడుపు చెక్కలయ్యేలా నవ్వించగల ట్రాక్ ను రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
చిరు- అనిల్ కాంబో అంటూ అనౌన్స్మెంట్ రాగానే భారీ అంచనాలు పెట్టుకున్న మేకర్స్.. వెంకీ నటిస్తున్నారని తెలియడంతో వాటిని మరింత పెంచుకున్నారు. సినిమా కోసం అటు మెగాస్టార్, వెంకీ అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి ఎలాంటి ట్రీట్ ఇస్తారోనని చూస్తున్నారు.
నిజానికి.. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిన విషయమే. ఎఫ్-2, ఎఫ్-3 సహా పలు సినిమాలే దానికి ఉదాహరణ. దీంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఏం చేస్తారోనని ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈసారి కూడా చిరు సినిమాతో ఫుల్ గా అనిల్ రావిపూడి నవ్వించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా చిరంజీవి- వెంకటేష్ మధ్య కడుపు చెక్కలయ్యేలా నవ్వించగల ట్రాక్ ను రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనుందని.. థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ అంతా ఖచ్చితంగా నవ్వుతారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అలాంటి ఓ హిలారియస్ ఎపిసోడ్ ను సిద్ధం చేస్తున్నారని వినికిడి.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక్క అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతుందని అంటున్నారు. ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా వెంకీ కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు. ఇటీవల వెంకటేష్.. చిరు మూవీలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పారు.
కాగా సినిమా విషయానికొస్తే.. మన శంకర వరప్రసాద్ గారు మూవీకి చిరు కుమార్తె సుస్మిత ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. త్వరలో డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.