చిరు - వెంకటేష్ కాంబోలో స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరంటే?
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు చిత్ర బృందం.;
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు చిత్ర బృందం.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ ఈరోజు జరగబోతుందని ఈ కార్యక్రమానికి ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి లేదా ప్రముఖ స్టార్ హీరో తేజ సజ్జ హోస్టుగా వ్యవహరించే అవకాశాలున్నట్లు సమాచారం.అసలే సీనియర్ హీరోలను ఒకే తెరపై చూడాలి అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది ఇండస్ట్రీలో బడా హీరోలుగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ , చిరంజీవి కలిసి ఒకే తెరపై కనిపించడమే కాకుండా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారని తెలియడంతో అభిమానులు ఈ ఇంటర్వ్యూ కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో ఎలాంటి విషయాలు చర్చించబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇక మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి వస్తే ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి యూ/ ఏ సర్టిఫికెట్ను సెన్సార్ సభ్యులు జారీ చేశారు. మరోవైపు లేడీ సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు మరొకసారి చిరంజీవితో కట్టింది నయనతార. మరి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి భారీ కలెక్షన్స్ వసూలు చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్, చిరంజీవి , నయనతార కీలకపాత్రలు పోషిస్తుండగా..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్ , ట్రైలర్ , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు కేథరిన్ థ్రేసా, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేన, హర్షవర్ధన్ అభినవ గోమఠం రఘు బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
అటు వెంకటేష్ విషయానికి వస్తే గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి విజేతగా నిలిచిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ ఇదే సంక్రాంతికి హీరోగా కాకుండా కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మరి ఈ పాత్ర ఆయనకు ఇంకెలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. అలాగే ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.