మెగా మూవీకి ప్యారడైజ్‌తో సంబంధం ఉంటుందా? లేదా?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం 'ది ప్యారడైజ్' మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం 'ది ప్యారడైజ్' మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. అనేక కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యంగా ప్రారంభం అయింది, అంతకు మించి షూటింగ్ ఆలస్యం అవుతోంది. విడుదలకు మరికొన్ని రోజులు ఉండగా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదనే వార్తలు వస్తున్నాయి. మేకింగ్ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా మంది సీనియర్ దర్శకుల మాదిరిగా వ్యవహరిస్తున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సినిమాలను అద్భుతంగా తీస్తాడనే పేరు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అని కొందరు అంటున్నారు. ఇప్పటికే ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఓటీటీ డీల్ ఉన్న కారణంగా చివరి నిమిషంలో హడావిడిగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాని ది ప్యారడైజ్ మూవీ రిలీజ్...
ది ప్యారడైజ్ మూవీని ఈనెల 24న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నానితో సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఏంటి అంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవితో అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో నాని, సుష్మితల నిర్మాణంలో సినిమా ప్రకటన వచ్చింది. కనుక వచ్చే ఏడాదిలో లేదా అన్నీ కలిసి వస్తే ఇదే ఏడాది చివర్లో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అభిమానులు బలంగా భావిస్తున్నారు. ఇప్పటికే ప్రకటన వచ్చినప్పటికీ కొందరు మాత్రం 'ది ప్యారడైజ్' సినిమా ఫలితాన్ని బట్టి చిరంజీవి నిర్ణయం ఉంటుందని కొందరు అంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న కాకా సినిమాతో పాటు విశ్వంభర ఫలితాలు సైతం శ్రీకాంత్ ఓదెలతో సినిమా విషయంలో నిర్ణయాన్ని మార్చే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
చిరంజీవి విశ్వంభర ఎప్పుడు?
చిరంజీవి నటించిన 'విశ్వంభర' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న విశ్వంభర కు చివరి దశ వీఎఫ్‌ఎక్స్ వర్క్ నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఇక దర్శకుడు బాబీ దర్శకత్వంలో కాకా సినిమా సైతం షూటింగ్ జరుగుతోంది. కాకా సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. విశ్వంభర సినిమా విడుదల విషయంలో క్లారిటీ రాలేదు. ఈ ఏడాది చివరి వరకు విశ్వంభర వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు. విశ్వంభర, కాకా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ది ప్యారడైజ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే చిరంజీవి వెంటనే శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఈ కాంబో మూవీపై పలు రకాల పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా...
2024 డిసెంబర్ 3న హీరో నాని స్వయంగా చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీని ప్రకటించారు. మరో రెండు నెలలు అయితే ప్రకటన వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం కాలేదు అనే ప్రశ్న చాలా మంది మదిని తొలుస్తుంది. చిరంజీవితో సినిమా కంటే ముందు శ్రీకాంత్ ఓదెల తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన నానితో మరో సినిమాను చేయాలి అనుకున్నాడు. అంతకు ముందే రెడీ అయిన స్క్రిప్ట్ తో నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. చిరంజీవి ఆయన సినిమాలతో, శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్‌తో బిజీగా ఉన్న కారనంగా వీరి కాంబో మూవీ గురించి ఎక్కడ చర్చ జరగలేదు. కానీ ఇప్పటికే స్టోరీ లైన్ లాక్ అయింది.
ప్యారడైజ్ రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ రెడీ చేయడం, దాన్ని చిరంజీవికి వినిపించడం, ఆయన ఓకే చెప్తే షూటింగ్‌కు వెళ్లడం జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది వరకు సినిమా ప్రారంభం అయ్యి, 2028లో విడుదలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు వీరికాంబో మూవీ క్యాన్సల్ అని ఎక్కడ ప్రచారం జరగలేదు. కనుక ఇంకా లైన్‌లో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ ఉంది. కనుక ఫ్యాన్స్ కచ్చితంగా ఓ మంచి హై ఓల్టేజ్ మూవీని చూడబోతున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.