పాట‌ల‌తో మెగా హీరోల సంద‌డి!

2025 ఆఖ‌రికి వ‌చ్చేసింది. మ‌రో రెండు వారాల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం.;

Update: 2025-12-14 13:00 GMT

2025 ఆఖ‌రికి వ‌చ్చేసింది. మ‌రో రెండు వారాల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. అయితే ఈ ఇయ‌ర్ ను కాస్త గ్రాండ్ గానే ఎండ్ చేస్తున్నారు మెగా హీరోలు. తాము న‌టిస్తున్న కొత్త సినిమాల్లోని పాట‌ల‌తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్న మెగా హీరోలు 2026 మొద‌ట్లో త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే వారు న‌టిస్తున్న సినిమాల్లోని సాంగ్స్ ను రిలీజ్ చేసి ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు.

మూడు పాటలూ చార్ట్‌బ‌స్ట‌ర్లే!

మెగాస్టార్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ తో స్టార్ట్ అయిన హ‌డావిడి, ఆ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న పెద్దిలోని చికిరి చికిరి సాంగ్ తో కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ ట్రెండ్ ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ లోని ఫ‌స్ట్ సింగిల్ దేఖ్‌లేంగే సాలా సాంగ్ తో కొన‌సాగిస్తున్నారు. దీంతో మెగా హీరోల సినిమాల నుంచి వ‌చ్చిన మూడు పాట‌లూ మంచి చార్ట్‌బ‌స్ట‌ర్లుగా న‌మోదై, హ్యాట్రిక్ గా నిలిచాయి.

త‌మ స్టెప్పుల‌తో నెక్ట్స్ లెవెల్ కు..

ఈ సాంగ్స్ కేవ‌లం విన‌డానికి మాత్ర‌మే బ్లాక్ బ‌స్ట‌ర్లు కాదు, వాటిని మెగా హీరోలు త‌మ స్టెప్పుల‌తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన విధానాన్ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ చెప్పుకుంటున్నారు. లిరిక‌ల్ సాంగ్సే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫుల్ సాంగ్ లో త‌మ హీరోల‌ను బిగ్ స్క్రీన్ పై చూడ్డానికి త‌మ రెండు క‌ళ్లు కూడా స‌రిపోవ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ త‌మ అభిప్రాయాల‌ను వెల్లిబుచ్చుతున్నారు.

ఎక్క‌డ చూసినా చికిరి పాటే!

మీసాల పిల్ల సాంగ్ లో మెగాస్టార్ త‌న డ్యాన్స్ మూమెంట్స్ తో అల‌రించ‌గా, చికిరి సాంగ్ లో రామ్ చ‌ర‌ణ్ వేసిన హుక్ స్టెప్ ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫేమస్ అయి, సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఇవే రీల్స్ క‌నిపిస్తున్నాయి. తాజాగా వాటికి ప‌వ‌ర్ స్టార్ స్వాగ్ తోడైంది. దేఖ్‌లేంగే సాలా సాంగ్ లో ప‌వ‌న్ ఎన‌ర్జీ, ఆయ‌న‌ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను మ‌రింత మెస్మ‌రైజ్ చేశాయి.

మ‌రీ ముఖ్యంగా ఉస్తాద్ భ‌గ‌త్ సాంగ్ లోని దేఖ్‌లేంగే సాలా సాంగ్ కు దేవీ శ్రీ ఇచ్చిన ట్యూన్, మంచి లిరిక్స్ ఆడియ‌న్స్ ను చాలా త‌క్కువ టైమ్ లోనే ఆక‌ట్టుకున్నాయి. వాటికి తోడు ఈ సాంగ్ లో ప‌వ‌న్ స్టైలిష్ గా క‌నిపించ‌డంతో సినిమా రిలీజ‌య్యాక ఆ సాంగ్ థియేట‌ర్ల‌లో భారీ స్థాయిలో హంగామా చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఈ మూడు సాంగ్స్ లో మ్యూజిక్, విజువ‌ల్స్, కొరియోగ్ర‌ఫీకి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి యునానిమ‌స్ పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో పాటూ ఆయా సినిమాల‌పై ఈ సాంగ్స్ మ‌రిన్ని అంచ‌నాలను పెంచాయి.

Tags:    

Similar News