• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చంద్ర‌బాబు (Vs) చిరంజీవి:...

చంద్ర‌బాబు (Vs) చిరంజీవి: 'మైండ్ సెట్ షిఫ్ట్' గురించి అద‌ర‌గొట్టారు!

| విజయం సాధించాలంటే కష్టంతో పాటు ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నారు. అలిపిరి దాడి సమయంలో చంద్రబాబు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. సవాళ్లను పాఠాలుగా మార్చుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

By - Sivaji Kontham
Update: 2026-11-16 04:13 GMT

జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటమే కాకుండా.. ఆలోచనా విధానంలో మార్పు రావాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలను షేర్ చేసుకున్నారు. మనిషి తన పరిధులను దాటి ఆలోచించినప్పుడే నిజమైన వృద్ధి సాధ్యమవుతుందని.. అందుకు `మైండ్ సెట్ షిఫ్ట్` అత్యంత కీలకమని చిరు పేర్కొన్నారు.

సాధారణ కుటుంబం నుండి వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టే సమయంలో తాను ఎన్నో వ్యతిరేకతలను.. నిరుత్సాహపరిచే మాటలను ఎదుర్కొన్నట్లు చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎవరూ ఇండస్ట్రీకి వెళ్లవద్దని వారించినా తనకు నటనపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగానని తెలిపారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో చెన్నైలో ఐసీడబ్ల్యూఏ కోర్సు చేస్తూనే.. మరోవైపు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో అంకితభావంతో శిక్షణ తీసుకున్నట్లు ఆయన వివరించారు. జీవితంలో రెండు పడవల ప్రయాణం చేసినా..చివరికి తన లక్ష్యమైన నటనపైనే పూర్తి దృష్టి పెట్టానని చెప్పారు.

సినిమా రంగంలోకి వచ్చాక కూడా తనకు చిన్న చిన్న విల‌న్ పాత్రలు ఆఫర్ చేసిన సందర్భాలున్నాయని.. అయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభను చాటుకున్నానని చిరంజీవి తెలిపారు. చేసే పనిపై స్పష్టత, అంకితభావం, నిరంతరం నేర్చుకునే తత్వంతో పాటు మంచి వ్యక్తిత్వం ఉంటే ఏ రంగంలోనైనా తిరుగు ఉండదని పేర్కొన్నారు. ప్రేక్షకులు తమను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టడమే అసలైన విజయమని అహూతుల‌లో స్ఫూర్తిని నింపారు.

ఇదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలతో రాజకీయాల్లోకి వచ్చి.. క్లిష్టమైన సంక్షోభాలను ఎదుర్కొని అంచలంచలుగా ఎదిగిన చంద్రబాబు ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా.. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారని కొనియాడారు. అలిపిరిలో చంద్ర‌బాబు నాయుడుపై దాడి గురించి ప్ర‌స్థావించిన చిరు ఆయ‌న ఆరోజు ఎంతో ధైర్యంగా క‌నిపించార‌ని.. జీవితంలో ఏం జ‌రిగినా అదే ధైర్యాన్ని, స్త్వైర్యాన్ని చూపడం అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

చివరిగా యువతను ఉద్దేశించి మాట్లాడిన మెగాస్టార్.. జీవితం పూలపానుపు కాదని.. ప్రతీక్షణం సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని తెలిపారు. ఆటంకాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా.. వాటినే అభ్యాసాలుగా మార్చుకుని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సరైన మైండ్ సెట్‌తో సానుకూల దృక్పథంతో మునుకెళ్తే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని మెగాస్టార్ యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ కూడా పాల్గొన్నారు.

Tags:    
  • chiranjeevi 
  • chandrababu 
  • megastar 
  • mindsetshift 
  • successmantra 

Similar News

సాయి పల్లవి ఇమేజ్ మారాల్సిన సమయం వచ్చిందా?

2026-11-16 04:30 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

నిర్మాతలకు అండగా నిలిచిన హీరో.. స్టార్ హీరో పై మురళీ మోహన్ ప్రశంసలు

2026-11-16 04:30 GMT

పెళ్లి - పిల్ల‌లు వ‌ద్దే వ‌ద్దు.. ఈ సీనియ‌ర్ హీరో బ్యాచిల‌ర్ల‌కు ఆద‌ర్శం?

2026-11-16 04:30 GMT

మలయాళం × తెలుగు.. ఇద్దరూ ఇద్దరే!

2026-11-16 04:29 GMT

సాయి పల్లవి, శ్రీలీలకు ‘ఓం’ అగ్నిపరీక్ష

2026-11-16 04:29 GMT

మెగాస్టార్ వార‌సుడే అయినా.. అల్లు అర్జున్ నోట అలాంటి మాట‌!

2026-11-16 04:19 GMT

'కాకా'లో కాక‌లు పుట్టించే ఐట‌మ్ గాళ్ ఎవ‌రో?

2026-11-16 04:17 GMT

నిరాశ‌లో ఫ్యాన్స్.. 'రాకా' గురించి ఐకాన్‌స్టార్ అప్‌డేట్!

2026-11-16 04:15 GMT

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

Bigg Boss Telugu 10: పంచ్‌ల వర్షం కురిపించిన హైపర్ ఆది!

2026-11-16 04:09 GMT

Copyright @2026

Powered by Blink CMS