• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి, శ్రీలీలకు...

సాయి పల్లవి, శ్రీలీలకు ‘ఓం’ అగ్నిపరీక్ష

| ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 'ఓం' సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండనుంది. సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీలీల విభిన్నమైన గృహిణి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా నటించే అవకాశం ఇద్దరికీ దక్కింది. వరుస విజయాల కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు హీరోయిన్లకు 'ఓం' సినిమా కెరీర్ పరంగా కీలకంగా మారనుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-16 04:29 GMT

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమా చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ధనుష్ కంటే హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీలకు ఎక్కువ కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం చాలా అవసరం. ఇద్దరికీ ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలు దక్కాయి. తమ నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది.

ముందుగా సాయి పల్లవి విషయానికి వస్తే.. ఆమెకు నటిగా మంచి గుర్తింపు ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఈమధ్య ఆమె నటించిన రామాయణం సినిమా విషయంలో మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొంది.

భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించినప్పటికీ, సాయి పల్లవికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రశంసలు రాలేదు. ఇప్పుడు ఓం సినిమాలో సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు ఇది భిన్నంగా ఉండబోతోంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ నేపథ్యంతో కూడిన పాత్రలో తన నటనను మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ పాత్ర పై కూడా విమర్శలు వస్తే.. ఇక సాయి పల్లవి పై ట్రోల్స్ మరింత ఎక్కువ అవ్వడం కాదు. కాబట్టి ఈ సినిమా సాయి పల్లవికి కూడా చాలా కీలకం.

ఇక శ్రీలీల విషయానికి వస్తే.. తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం రావడం లేదు. వరుస పరాజయాలు ఎదురైనా ఆమెకు కొత్త సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందీ, తమిళ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఓం సినిమా ఆమెకు కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో శ్రీలీల ఒక రాయకరమైన హౌస్ వైఫ్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, డ్యాన్స్, ఎనర్జిటిక్ పాత్రల్లో కనిపించిన ఆమెకు ఇది భిన్నమైన అవకాశం.

ఒకరు పోలీస్ ఆఫీసర్‌గా, మరొకరు సాంప్రదాయమైన అమ్మాయిగా కనిపించనుండటంతో ఈ ఇద్దరి పాత్రలపై ఆసక్తి పెరుగుతోంది. సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకోవాలి.

Tags:    
  • dhanush 
  • ommovie 
  • saipallavi 
  • sreeleela 
  • tamilcinema 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS