• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కాకా'లో కాక‌లు పుట్టించే...

'కాకా'లో కాక‌లు పుట్టించే ఐట‌మ్ గాళ్ ఎవ‌రో?

| చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో ఐటమ్ సాంగ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దర్శకుడు బాబీ ప్రత్యేక గీతం కోసం రితికా సింగ్‌ను ఎంపిక చేసినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-16 04:17 GMT

ఐట‌మ్ నంబ‌ర్ అంటే కిక్కు ఎక్కించేంది.. కిక్కు దించేది కాదు! అందుకే ఒక ఐట‌మ్ పాట‌కు బ్యూటీని ఎంపిక చేయ‌డం అంటే చాలా క‌స‌ర‌త్తు చేస్తుంది చిత్ర‌బృందం. ఇప్పుడు అలాంటి క‌స‌ర‌త్తుల్లోనే ఉందిట కాకా బృందం. ద‌ర్శ‌కుడు బాబి మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించే అంద‌గ‌త్తె కోసం వెతుకుతున్నార‌ని కొంత‌కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు త‌మిళ హీరోయిన్ రితికా సింగ్‌ని ఎంపిక చేసార‌ని, పాట చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యిపోయింద‌ని కూడా కొన్ని మీడియాలు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ `కాకా` సినిమాలో ఐట‌మ్ పాట‌లో ఫ‌లానా న‌టిని ఎంపిక చేసామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. రితికానే ఏరికోరి ఎంపిక చేయ‌డానికి కార‌ణం ఏమిటి? అన్న‌ది బాబి మాత్ర‌మే చెప్పాల్సి ఉంటుంది. కింగ్ ఆఫ్ కోతా (దుల్క‌ర్) సినిమాలో రితిక ఐట‌మ్ పాట ఇంప్రెస్ చేయ‌డం వ‌ల్ల‌నే ఎంపిక చేసారా? అన్న‌ది కూడా అత‌డే చెప్పాల్సి ఉంది. క‌త్రిన‌, క‌రీనా, మ‌లైకా, స‌న్నీలియోన్ లాంటి భామ‌లు ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు గ‌నుక యంగ్ హీరోయిన్‌ల‌నే ఐట‌మ్ నంబ‌ర్ల‌కు ఎంపిక చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌కులు ఆస‌క్తిగా ఉన్నారా? అన్న‌ది కూడా వేచి చూడాలి. కాజ‌ల్, కేథ‌రిన్, రాయ్ ల‌క్ష్మీ, రెజీనా లాంటి భామ‌లు గ‌తంలో చిరు సినిమాల్లో ఐట‌మ్ నంబ‌ర్ల‌లో మెరిసారు. అంత‌కంటే బెస్ట్ ఆప్ష‌న్ ఇప్పుడు ఎవ‌రు? అన్న‌ది కూడా వేచి చూడాలి.

మెగాస్టార్ `కాకా` సినిమా ఆక్వా క‌ల్చ‌ర్ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో రూపొందుతోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో చిరంజీవి రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మెగా ఫ్యాన్స్ సందేహాల‌న్నిటికీ చెక్ పెడుతూ కొత్త అప్ డేట్ ని చిత్ర‌బృందం చెబుతుందేమో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ విల‌న్ గా నటిస్తుండగా, అనస్వర రాజన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags:    
  • chiranjeevi 
  • kaaka 
  • ritikasingh 
  • bobby 
  • megastarmovie 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS