• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి - పిల్ల‌లు వ‌ద్దే...

పెళ్లి - పిల్ల‌లు వ‌ద్దే వ‌ద్దు.. ఈ సీనియ‌ర్ హీరో బ్యాచిల‌ర్ల‌కు ఆద‌ర్శం?

| 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తన నిర్ణయంపై గతంలో స్పష్టత ఇచ్చారు. వివాహం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితంపై నియంత్రణ తగ్గుతాయని, పిల్లలను పెంచడం వల్ల ప్రాధాన్యతలు మారిపోతాయని చెప్పారు. పెళ్లి, పిల్లలపై తనకు ఆసక్తి లేదని వెల్లడించారు. ప్రస్తుతం 'దురంధర్' ఫ్రాంచైజీలో రెహ్మాన్ డెకాయిట్ పాత్రతో ప్రశంసలు అందుకుంటున్న ఆయన నిర్ణయం టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలపై చర్చకు దారితీస్తోంది.

By - Sivaji Kontham
Update: 2026-11-16 04:30 GMT

జీవితంలో పెళ్లి, పిల్లలు, కుటుంబం.. ఆపై బాధ్య‌త‌లు ఇంతేనా? ఇదే ప్ర‌శ్న‌కు కొంద‌రు స్టార్లు ఇచ్చే జ‌వాబు రొటీన్ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా కూడా ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో పెళ్లి విష‌యంలో సాధార‌ణ‌ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో కూడా విచిత్ర‌మైన మార్పు క‌నిపిస్తోంది. సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో అయితే దీనిపై ఊహించ‌ని రీతిలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీవితంలో ర‌క‌ర‌కాల ఒత్తిళ్లు... కెరీర్ ప‌రంగా కావొచ్చు.. లేదా ఇత‌ర కార‌ణాలు ఏవైనా ఉండొచ్చు.. పెళ్లిని ఎగ్గొట్టే వారి సంఖ్య ఆశ్చ‌ర్య‌పోయేలాగే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ ప‌రిశీలిస్తే ఇప్ప‌టికిప్పుడే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న‌కు సిద్ధంగా లేని బ్యాచిల‌ర్లు ఉన్నారు. కొంద‌రు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైతే.. మ‌రికొంద‌రు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండా డైల‌మాలో ఉండిపోయిన వారు ఉన్నారు.

అయితే అలాంటి వారంద‌రికీ ఈ బాలీవుడ్ ఐకాన్ స్టార్ ఆద‌ర్శ‌మా? అంటే.. సోష‌ల్ మీడియాలో బోలెడంత డిబేట్ ర‌న్ అవుతోంది. వ‌య‌సు 50 ప్ల‌స్‌లో ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగా ఉన్నారు `దురంధ‌ర్` స్టార్ అక్ష‌య్ ఖ‌న్నా. అత‌డి దృష్టి మొత్తం కేవ‌లం కెరీర్ పైనే. పెళ్లి గురించిన ఆలోచ‌నే లేదు. కెరీర్ ఆరంభంలో అత‌డు ప్ర‌ముఖ క‌థానాయిక క‌రిష్మా క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగించార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఆ త‌ర్వాత మాత్రం అత‌డు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉన్నాడు. పెళ్లి ఊసెత్త‌లేదు. పైగా త‌న‌కు పెళ్లి ఆలోచ‌నే లేద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. ఇటీవ‌లి కాలంలో స‌ల్మాన్ భాయ్ కూడా ఇదే తీరుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

పెళ్లి, తండ్రి కావడం వంటి బాధ్యతలకు తాను ఎందుకు దూరంగా ఉన్నానో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఒక సందర్భంలో ఎంతో నిజాయితీగా వివరించారు. వివాహం అనేది జీవితశైలిలో భారీ మార్పును తీసుకువస్తుందని.. అలాగే మన జీవితంపై మనకున్న నియంత్రణను కొంతవరకు వదులుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విధంగా తన స్వేచ్ఛను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అక్షయ్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. పిల్లలను కనాలనే ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. ఒక బిడ్డను పెంచడం వల్ల జీవితంలో ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతాయని అక్ష‌య్ ఖ‌న్నా వివరించారు. తాను ఎప్పుడూ ఇలాగే ఉన్నానని.. భవిష్యత్తులో కూడా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు వస్తుందని తాను అనుకోవడం లేదని అక్షయ్ ఖన్నా కుండబద్దలు కొట్టారు. అయితే కెరీర్ కోసం పెళ్లిని, కుటుంబాన్ని త్యాగం చేసిన అత‌డికి కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల జోష్ క‌నిపిస్తోంది. దురంధ‌ర్ ఫ్రాంఛైజీలో లియారీ గ్యాంగ్ స్ట‌ర్ రెహ్మాన్ డెకైత్ గా అత‌డి న‌ట‌న‌కు అబ్బుర‌ప‌డిపోయిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటూ భారీగా స్థిరాస్తులు సంపాదించాడు. అత‌డికి ఇప్పుడు తాను కోరుకున్న కెరీర్ ఉంది.. ఆస్తిపాస్తులున్నాయి. అయినా ప్యామిలీ- పిల్ల‌లు లేరు!

ఇప్ప‌టివ‌ర‌కూ పెళ్లి - భార్య అనే ఆలోచ‌నే లేని కొంద‌రు టాలీవుడ్ బ్యాచిల‌ర్ హీరోల‌కు కూడా ఈ సీనియ‌ర్ హీరోనే ఆద‌ర్శం అనుకోవ‌చ్చా? అంటూ నెటిజ‌నులు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.

Tags:    
  • akshayekhanna 
  • dhurandhar 
  • bollywood 
  • akshayekhannamarriage 
  • singlelife 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS