• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మలయాళం × తెలుగు.. ఇద్దరూ...

మలయాళం × తెలుగు.. ఇద్దరూ ఇద్దరే!

| తెలుగు, మలయాళ ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విశేషంగా మారింది. ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ వేడుకలో బ్లాక్ సూట్లలో పక్కపక్కన కూర్చున్న వీరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ తెలుగులో, ‘ఆర్య’, ‘హ్యాపీ’, ‘పుష్ప’తో బన్నీ కేరళలో అభిమానులను సంపాదించుకున్నారు.

By - M Prashanth
Update: 2026-11-16 04:29 GMT

ఒక భాషలో స్టార్ హీరోగా ఎదగడమే కష్టం. అలాంటిది మరో భాషలోనూ సొంత ఇండస్ట్రీ హీరో స్థాయిలో అభిమానులను సంపాదించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా తెలుగు, మలయాళ ఇండస్ట్రీల మధ్య ఇలాంటి క్రేజ్ సంపాదించిన హీరోలు చాలా తక్కువమందే ఉన్నారు. కానీ ఇద్దరు హీరోలు మాత్రం తమ సినిమాలతో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విశేషం.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రతో ఆకట్టుకున్న దుల్కర్, 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమా తర్వాత దుల్కర్‌ను చాలామంది మన హీరోగానే చూడటం మొదలుపెట్టారు. ఇక 'లక్కీ భాస్కర్'తో మరో హిట్ అందుకున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా పరిచయమైనప్పటికీ తెలుగులో మాత్రం తన సినిమాలతోనే మార్కెట్ సంపాదించుకున్నారు.

మరోవైపు తెలుగు నుంచి మలయాళంలో అంతటి క్రేజ్ సంపాదించిన హీరోల్లో అల్లు అర్జున్ ముందుంటారు. 'ఆర్య'తో కేరళ ప్రేక్షకులకు పరిచయమైన బన్నీ, ఆ తర్వాత 'హ్యాపీ', 'ఆర్య 2' వంటి సినిమాలతో అక్కడ అభిమానులను పెంచుకున్నారు. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు బన్నీని 'మల్లు అర్జున్' అని పిలుచుకుంటారు. 'పుష్ప' కంటే చాలా ఏళ్ల ముందే కేరళలో ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

బన్నీ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఏడాది మరో సర్ ప్రైజ్ హైలెట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'హ్యాపీ' మలయాళ వెర్షన్‌ను జూన్‌లో కేరళలో రీ రిలీజ్ చేయగా అభిమానులు థియేటర్లలో ఎగబడి చూశారు. నార్మల్ గా ఇతర భాషల హీరోల పాత సినిమాలకు ఇలాంటి రెస్పాన్స్ రావడం అరుదు. బన్నీకి కేరళలో ఇప్పటికీ ఎంత ఆదరణ ఉందో ఆ రీ రిలీజ్ చూపించింది.

ఇలా దుల్కర్ మలయాళం నుంచి వచ్చి తెలుగులో సొంత మార్కెట్ ఏర్పరుచుకుంటే, బన్నీ తెలుగు నుంచి కేరళలో పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. దుల్కర్ డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. బన్నీ మాత్రం మలయాళంలో ఒక్క సినిమా కూడా నేరుగా చేయకుండానే అక్కడ స్టార్‌గా ఎదిగారు. వీరిద్దరూ ప్రయాణించిన దారులు వేరైనా పక్క రాష్ట్రాల ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ఇక ఈ ఇద్దరూ ఆదివారం జరిగిన 'ఆకాశంలో ఒక తార' ప్రీ రిలీజ్ వేడుకలో పక్కపక్కనే కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ బ్లాక్ సూట్లలో కనిపించారు. ఈ సందర్భంగా దుల్కర్ కథల సెలక్షన్ ను, వ్యక్తిత్వాన్ని బన్నీ ప్రశంసించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ నటించిన 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Tags:    
  • alluarjun 
  • dulquersalmaan 
  • aakasamlookatara 
  • malluarjun 
  • telugucinema 

Similar News

సాయి పల్లవి ఇమేజ్ మారాల్సిన సమయం వచ్చిందా?

2026-11-16 04:30 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

నిర్మాతలకు అండగా నిలిచిన హీరో.. స్టార్ హీరో పై మురళీ మోహన్ ప్రశంసలు

2026-11-16 04:30 GMT

పెళ్లి - పిల్ల‌లు వ‌ద్దే వ‌ద్దు.. ఈ సీనియ‌ర్ హీరో బ్యాచిల‌ర్ల‌కు ఆద‌ర్శం?

2026-11-16 04:30 GMT

సాయి పల్లవి, శ్రీలీలకు ‘ఓం’ అగ్నిపరీక్ష

2026-11-16 04:29 GMT

మెగాస్టార్ వార‌సుడే అయినా.. అల్లు అర్జున్ నోట అలాంటి మాట‌!

2026-11-16 04:19 GMT

'కాకా'లో కాక‌లు పుట్టించే ఐట‌మ్ గాళ్ ఎవ‌రో?

2026-11-16 04:17 GMT

నిరాశ‌లో ఫ్యాన్స్.. 'రాకా' గురించి ఐకాన్‌స్టార్ అప్‌డేట్!

2026-11-16 04:15 GMT

చంద్ర‌బాబు (Vs) చిరంజీవి: 'మైండ్ సెట్ షిఫ్ట్' గురించి అద‌ర‌గొట్టారు!

2026-11-16 04:13 GMT

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

Bigg Boss Telugu 10: పంచ్‌ల వర్షం కురిపించిన హైపర్ ఆది!

2026-11-16 04:09 GMT

Copyright @2026

Powered by Blink CMS