బాక్సాఫీస్ వద్ద మెగా 'ర్యాంపేజ్'.. టికెట్ల వేటలో సరికొత్త రికార్డ్
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ పవర్ ఏంటో మరోసారి నిరూపిస్తున్నారు.;
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ పవర్ ఏంటో మరోసారి నిరూపిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటి కిక్కిస్తోంది. కేవలం మాస్ ప్రేక్షకులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ లెక్కలు మారుతున్నాయి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో ఇచ్చిన ప్రతి ప్రామిస్‌ను నిలబెట్టుకున్నారని చెప్పాలి. గత కొన్ని సినిమాల్లో మెగాస్టార్ నుంచి ఆడియన్స్ ఏదైతే మిస్ అయ్యారో, వాటన్నింటినీ ఈ సినిమాలో పక్కాగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా బాస్ కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమా ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఒకేలా అలరిస్తుండటంతో వసూళ్లలో నిలకడ కనిపిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ కు పైగా టికెట్ల సేల్స్‌ను నమోదు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం ఒకట్రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయంటే బాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పండుగ సెలవులు ఇంకా ముందే ఉండటంతో ఈ టికెట్ల వేట మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే చిరంజీవి కెరీర్‌లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లను రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో వచ్చి కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతి సీజన్‌ను బాస్ తన కలెక్షన్లతో ఫుల్ గా వాడేసుకుంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్, నయనతార హీరోయిన్‌గా నటించడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. మెగాస్టార్ వెంకటేష్ కాంబినేషన్ సీన్లు థియేటర్లలో నవ్వుల హంగామాను సృష్టిస్తున్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా అనిల్ రావిపూడి ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
రేపటి నుంచి పండుగ సెలవులు అధికారికంగా ప్రారంభమవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర 'MSG' జోరు ఇంకా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఈ మెగా ఎంటర్‌టైనర్ రికార్డు స్థాయి వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పండుగ ముగిసేసరికి ఈ సినిమా ఫైనల్ వసూళ్ల లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.