చిరంజీవి అండ్ కో గుమ్మడికాయ!
అనీల్ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. ఎలాంటి ఈవెంట్ దొరికినా? సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసి సినిమాకు రీచ్ ఉండేలా చూస్తాడు.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకర వరప్రసాద్ గారు` తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పనులు కూడా ప్రారంభించారు. లిరికల్ సాంగ్స్ తో శ్రోతలకి సినిమాను ఎక్కిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్ కు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. చిరంజీవి కూడా ఇప్పటికే తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ అయిపోయారు. డబ్బింగ్ కి సంబంధించిన పనులు పూర్తి చేయాలి.
మరి ఓవరాల్ గా సినిమా షూటింగ్ పూర్తయిందంటే? ఇంకా లేదనే తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ సెవెన్ ఏకర్స్ లో జరుగుతోంది. మరో రెండు రోజుల పాటు షూట్ అక్కడే జరగనుంది. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. అదే రోజు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఆ రోజు మాత్రం చిరంజీవి సెట్స్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ చివరి రోజు కాబట్టి ఆ రోజు చిరు తప్పక హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఆ ఈవెంట్ ను అనీల్ ఎంత స్పెషల్ గాప్లాన్ చేస్తున్నాడు? అన్నది కూడా కీలకమే.
అనీల్ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. ఎలాంటి ఈవెంట్ దొరికినా? సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసి సినిమాకు రీచ్ ఉండేలా చూస్తాడు. మరి క్లైమాక్స్ షూటింగ్ రోజున అన్నయ్యతో స్పెషల్ వీడియో ఏదైనా చేసి రిలీజ్ చేస్తాడా? అన్నది చూడాలి. సినిమా ప్రారంభోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే. ప్రారంభానికి ముందే హీరోయిన్ నయనతార ప్రీ ప్రమోషన్ లో భాగం చేసాడు. ప్రచార కార్యక్రమాలు అంటేనే దూరంగా ఉండే నయనతార అనీల్ విషయంలో రాజీ పడిపోయింది.
ఏం మాట్లాడి కన్విన్స్ చేసాడు? అన్నది ఇప్పటికీ సస్పెన్సే. ఇక అసలైన ప్రచారం ఇప్పటి నుంచి ప్రారంభ మవుతుంది. అందులో నయన్ జాయిన్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. అలాగే ఏ సినిమాకైనా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అందులో దాదాపు నటీనటులంతా భాగమవుతుంటారు. హీరో సహా అంతా అటెండ్ అవుతారు. ఆ ఈవెంట్ ను మాత్రం ఎవరూ మిస్ కారు. ఈనేపథ్యంలో వరప్రసాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు నయనతార హాజరవుతుందా? లేదా? అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఆరంభమే అదరగొట్టిన నయనతార ముగింపు ఈవెంట్లో అలరించదా? అన్న నమ్మకంతో మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.