• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చాలా హ్యాపీ.. నిజంగా అది...

చాలా హ్యాపీ.. నిజంగా అది గౌరవం: చిరంజీవి

| అదే సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో మోదీ.. నిన్న (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

By - Tupaki Desk
Update: 2025-02-08 05:24 GMT

భారత్‌ ను గ్లోబల్‌ ఎంటర్టైన్మెంట్‌ హబ్‌ గా మార్చడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. 2025 చివరలో వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ (WAVES)ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో మోదీ.. నిన్న (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి నుంచి సమ్మిట్ గురించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

అయితే కాన్ఫరెన్స్ లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఇప్పుడు చిరంజీవి తాజాగా పోస్ట్‌ పెట్టారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. WAVES అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో గౌరవం కూడా ఉందని తెలిపారు.

"ఈ గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. WAVES (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం, ఇతర సభ్యులతో పాటు నా అభిప్రాయం పంచుకోవడం నిజంగా ఒక గౌరవం" అని చెప్పారు. అనంతరం మోదీపై ప్రశంసలు కురిపించారు.

నరేంద్ర మోదీ జీ జ్ఞాన బండారం నుంచి వచ్చిన WAVES భారతదేశ పవర్ ను ప్రపంచంలో ఎత్తులకు నడిపిస్తుందని నాకు ఎటువంటి సందేహం లేదని తెలిపారు చిరు. త్వరలోనే కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిరంజీవి పోస్ట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

అయితే నిన్న జరిగిన భేటీ తర్వాత మోదీ కూడా పోస్ట్ పెట్టారు. WAVES అడ్వైజరీ బోర్డుతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సినీ సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు భారత్‌ ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌ గా తీర్చిదిద్దడంతోపాటు సమ్మిట్‌ కోసం విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు.

కాగా, చిరంజీవి, నాగార్జునతోపాటు బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, షారుక్ ఖాన్‌, అమీర్ ఖాన్, అక్షయ్‌ కుమార్‌, అనిల్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, హేమమాలినీ, దీపికా పదుకొణె తదితరులతోపాటు వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏
It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members.

I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025
Tags:    
  • WAVES 
  • Chiranjeevi 
  • Modi 
  • IndianCinema 
  • EntertainmentHub 
  • IndianFilmIndustry 
  • GlobalEntertainment 
  • Bollywood 
  • Tollywood 
  • VideoConference 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS