చిరంజీవి విభిన్న తరాల మధ్య వారధి!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఒక అద్భుతమైన ప్రయాణం. దశాబ్దాల క్రితం నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకో వడానికి స్టార్ ఇమేజ్‌ను నిర్మించుకోవడానికి ఆయన పడిన కష్టం మాట‌ల్లో చెప్ప‌లేనిది.

Update: 2026-07-10 14:30 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఒక అద్భుతమైన ప్రయాణం. దశాబ్దాల క్రితం నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకో వడానికి స్టార్ ఇమేజ్‌ను నిర్మించుకోవడానికి ఆయన పడిన కష్టం మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఆ రోజుల్లో డాన్స్, ఫైట్స్ , మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలే ఆయనకు మెగాస్టార్ హోదాను తెచ్చిపెట్టాయి. ఆ కాలం నాటి చిరంజీవి అంటేనే ఒక ఎనర్జీ.. ఒక మాస్ ఎరా గుర్తొస్తుంది. ప్రేక్షకులు అయ‌న్ని ఒక హీరోగానే కాకుండా తమ కష్టాలను మర్చిపోయేలా చేసిన‌ ఒక మ్యాజిక్ గా భావించేవారు.

కానీ కాలంతో పాటు చిరంజీవి పాత్రల ఎంపికలో వచ్చిన మార్పు చాలా ఆసక్తికరం. ఇప్పుడు ఆయన ఎంచు కుంటున్న సినిమాలు కేవలం మాస్ హీరో ఇమేజ్ చుట్టూ తిరగడం లేదు. కథాబలం ఉన్న ఎమోషనల్ డెప్త్ ఉన్న అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే యూనివర్సల్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు కుటుంబాలన్నీ కలిసి చూడదగ్గ కథలను, సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇచ్చే చిత్రాలను ఎంచుకుంటున్నారు.

గతంలో చిరంజీవి సినిమాల్లో హీరో పాత్ర అంటే? ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన వయసుకు తగినట్లుగా, అనుభవానికి తగ్గట్లుగా పరిణతి చెందిన పాత్రల్లో కనిపిస్తున్నారు. `సైరా నరసింహారెడ్డి` వంటి చారిత్రక పాత్రలైనా? లేదా ఇటీవలి కాలంలో వస్తున్న వైవిధ్యమైన కథలైనా అన్న‌య్య తనలోని నటుడిని మరోసారి ఆవిష్కరిస్తున్నారు. తన ఇమేజ్‌ను పక్కన పెట్టి, కేవలం కథ డిమాండ్ మేరకు తనను తాను మార్చుకుంటున్న విధానం కొత్త తరం నటులకు గొప్ప పాఠం లాంటిది.

ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రేక్షకులలో వ‌స్తోన్న మార్పును గమనించడమే. నేటి తరం ప్రేక్షకులు కేవలం హీరో బిల్డప్పుల కంటే? కథలోని సహజత్వాన్ని ఇష్టపడుతున్నారు. దీన్ని ముందే పసిగట్టిన చిరంజీవి ఏ తరం వారికైనా కనెక్ట్ అయ్యేలా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. దీనివల్ల చిరంజీవి మాస్ హీరోగానే కాకుండా ఒక `ఆల్-రౌండ్` ఆర్టిస్ట్‌గా అందరి మనసుల్లో నిలిచిపోతున్నారు. మెగాస్టార్ అంటే కేవలం ఒక స్టార్ కాదు. అన్ని తరాలను తన సినిమాలతో కలిపే ఒక వారధి లాంటి వారు.

చిరంజీవి ప్రస్తుత పద్ధతిని గమనిస్తే ఆయన బాక్సాఫీస్ రికార్డుల కంటే పాత్రలోని సంతృప్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అనిపిస్తుంది. తనకున్న స్టార్‌డమ్‌ను ఉపయోగించుకుని సమాజంలో మంచి సందేశం ఉన్న పాత్రలను ఎంచుకోవడం వల్ల గౌరవం మరింత పెరిగింది. పాత తరం అభిమానులకు అన్న‌య్య ఇప్పటికీ అదే మెగాస్టార్. కానీ కొత్త తరం ప్రేక్షకులకు ఒక నటుడిగా నిదర్శనం. ఈ సమతుల్యతనే చిరంజీవి కెరీర్‌ను ఇప్పటికీ సజీవంగా ఉంచుతోంది.

చివ‌రిగా చిరంజీవి కెరీర్ ప్రయాణం నిలకడైన అభివృద్ధికి చిహ్నం. మాస్ ఇమేజ్ కోసం కష్టపడిన రోజుల్లో ఎంతటి అంకితభావం చూపించారో? ఇప్పుడు యూనివర్సల్ కథలను ఎంచుకునే విషయంలోనూ అదే అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. తరాలు మారినా? అభిరుచులు మారినా ? చిరంజీవి స్థానం చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. మెగాస్టార్ చిరంజీవి తన కష్టంతో ఒక యుగాన్ని సృష్టించారు. ఇప్పుడు తన అనుభవంతో ఒక కొత్త శకానికి వారధిగా నిలుస్తున్నారు అన్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News