హిట్ మిషన్ 157 కోసం వాళ్లని దింపుతున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. చిరంజీవి సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ముందే రివీల్ చేసారు. మరోసారి చిరంజీవి కామెడీ తెరపై చూడబోతున్నారు అభిమానులు. ఈ సినిమాలో పాత్రని చిరంజీవి ఎంతో ఆస్వాదించి చేస్తున్నారు.
స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్న సమయంలోనే తానెంతగా నవ్వుకున్నారని రివీల్ చేసారు. మరోసారి కొదండ రామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పనిచేస్తుందని చిరంజీవి ఎంతో ఎగ్జైట్ అయ్యారు అనీల్ కామెడీ టైమింగ్ కి. మరి అలాంటి మెగాస్టార్ కి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం...అలీ లాంటి సీనియర్ కమెడియన్లు తోడైతే ఎలా ఉంటుంది? ఆ కామెడీ పీక్స్ కు చేరదు. అనీల్ ఇప్పుడు అదే ప్లాన్ చేసాడు.
ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ కూడా నటిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి-బ్రహ్మానందం-అలీ మధ్య కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆ కాంబినేషన్ లో ఎన్నో నవ్వులు పూయిం చే సన్నివేశాలున్నాయి. ఈ నేపథ్యంలో అనీల్ మెగాస్టార్ లో కామెడీని మరింత హైలైట్ చేసే దిశగా కొత్త నటీనటుల్ని రంగంలోకి దించుతున్నారు. ఇంత వరకూ బ్రహ్మానందం, అలీ అనీల్ రావిపూడి సినిమాల్లో నటించలేదు.
కానీ ఈ సారి అనీల్ స్క్రిప్ట్ ఆ సీనియర్ కమెడియన్లకు కూడా డిమాండ్ చేయడంతో రంగంలోకి దించుతు న్నట్లు కనిపిస్తుంది. చిరంజీవి- బ్రహ్మానందం మధ్య కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. బ్రహ్మానందంతో కామెడీని చిరంజీవి ఎంతో ఆస్వాది స్తారు. మళ్లీ చాలా కాలానికి ఆ ఛాన్స్ వచ్చినట్లు కనిపిస్తుంది.