మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో విలన్?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ఇది.;

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ఇది. చాలా కాలం తర్వాత చిరంజీవి కామిక్ పాత్రలో ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నారు. ఈ కథకు చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారో? ఆయన మాటల్లోనే అర్దమైంది. అనీల్ సీన్స్ చెబుతున్న సమయంలోనే నవ్వు ఆపుకోలేకపోయినట్లు...చాలా కాలం తర్వాత కోదండ రామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పనిచేస్తున్న అనుభవం కలుగుతుందన్నారు.
అలాగని సినిమాలో యాక్షన్ మిస్ అవ్వదు. అనీల్ సినిమా అంటే నవరసాలుంటాయి. అందులో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే? యువ హీరో కార్తికేయ గుమ్మడి కొండ పేరు తెరపైకి వస్తోంది. చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో కార్తికేయ నటిస్తు న్నాడని సన్నిహితుల నుంచి తెలిసింది. ఇందులో విలన్ పాత్ర లో కూడా కామిక్ గానే ఉంటుందిట.
మరి కార్తికేయ ఎంట్రీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే నిజమైతే కార్తికేయ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్లే. కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని . చిరంజీవిని చూసే తాను హీరో అవ్వాలనుకున్నాడు. ఎలాం టి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా? సినిమాలంటే ఆసక్తి...చిరంజీవి కి దగ్గరగా ఉండాలనే ఆశతో సినిమాల్లోకి వచ్చాడు. హీరో మెటీరియల్ కావడంతో `ఆర్ ఎక్స్ 100`లో హీరో అవకాశం వచ్చింది.
తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. అటుపై మరికొన్ని సినిమాలు చేసాడు. అలాగే తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన `వలిమై`లోనూ విలన్ గా నటించాడు. ఇలా కార్తికేయ మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో యువ నటుల్ని ప్రోత్సహించడంలో చిరంజీవి కూడా చొరవ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.