మెగా మూవీ పుకార్ల‌కు చెక్ పెట్టిన టీమ్

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర ఈప్రొడ‌క్ష‌న్ పనులు ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి రెడీ అవుతోంది.;

Update: 2026-04-24 07:08 GMT

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర ఈప్రొడ‌క్ష‌న్ పనులు ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. అయితే సినిమాలో ప్ర‌ధాన న‌టీనటుల ఎంపిక ప్ర‌క్రియ ఇంకా పూర్తి కాలేదు. చిరంజీవి కి జోడీగా ఇద్ద‌రు భామ‌లు న‌టించాల్సి ఉంది. ఆ పాత్ర‌ల‌కు సంబంధించి ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. మెగాస్టార్ వ‌య‌సుకు త‌గ్గ భామ‌ల్ని దించాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఆ విష‌యంలో కొంత జాప్యం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఓ కీలక పాత్రలో లేదా పవర్‌ఫుల్ క్యామియోలో కనిపిస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చేసాయి. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అంటూ కొట్టిపారేసారు. అనిల్ కపూర్ మాత్రమే కాదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతు న్నాయి. కొత్త న‌టులు సినిమాలో భాగ‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం తొలి నుంచి జ‌రుగుతోంది. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని అనీల్ క‌పూర సహా ఎవ‌రితో కూడా టీమ్ చర్చలు జ‌ర‌ప‌లేద‌న్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దర్శకుడు బాబీ స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నాడు.

బెంగాల్ నేపథ్యంలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో చిరంజీవి సరసన ఓ నాయిక‌గా ప్రియమణి ఎంపికైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కానీ స్టోరీ డిమాండ్ం మేర‌కు మ‌రో హీరోయిన్ కూడా అవ‌స‌ర‌మే. ఆ పాత్ర ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అలాగే చిరంజీవి కుమార్తె పాత్ర‌లో ప్రీతి ముకుందన్ నటిస్తుంద‌నే ప్రచారం సాగుతోంది. కానీ ఇందులోనూ క్లారిటీ లేదు.

వాస్త‌వానికి ఏప్రిల్ 11న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్లాన్ చేసారు. కానీ సాంకేతిక కారణాల వల్ల నిర్మాణ సంస్థకు చెందిన ఇతర చిత్రాల లీక్ ఇష్యూల వల్ల కొంత ఆలస్యమైంది.

దీంతో ఏప్రిల్ మూడో వారం లేదా నాలుగో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని స‌మాచారం. చిరంజీవి కూడా లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పాత్ర‌కు అనుగుణంగా, బాబీ విజన్‌కు ఎక్క‌డా త‌గ్గ‌కుండా సిద్ధమవుతున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `వాల్తేరు వీర‌య్య` ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్ స్టోరీపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. మెగాస్టార్ చూడాల‌ని ఉంది త‌ర్వాత మ‌ల్లీ కోల్ క‌త్తా నేప‌థ్యంలో మ‌రో సినిమా చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మెగా అభిమానులు నేప‌థ్యం ఎలా ఉంటుందనే దానిపై చ‌ర్చిస్తున్నారు.

Tags:    

Similar News