• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బూతులు తిడుతూ పోస్ట్-...

బూతులు తిడుతూ పోస్ట్- చిన్మయి కంప్లైంట్

| టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి.. కొన్ని నెలలుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-31 11:49 GMT

టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి.. కొన్ని నెలలుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నెట్టింట ఆమె పేరు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతోంది. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. కాస్టింగ్‌ కౌచ్‌ పై తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తోంది. చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతోంది. సోషల్ మీడియాలో తన గళాన్ని పోస్టులు రూపంలో వ్యక్తపరుస్తుంటోంది.

ఇటీవల చిన్మయి పెట్టిన ఓ పోస్ట్.. నెట్టింట పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల బంధాన్ని కూడా ఆమె తప్పుగా చూస్తున్నట్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత చిన్మయి గట్టిగా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు తనపై జరుగుతున్న ట్రోల్స్ పై హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టింది. చిన్మయితోపాటు సమంతను దారుణంగా కించపరుస్తూ అసభ్య పదజాలంతో ట్వీట్ పెట్టాడు ఓ నెటిజన్. దీంతో వెంటనే స్పందించింది చిన్మయి.

అతడి పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి చిన్మయి పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో యువత స్పందనతోపాటు వారి భాష ఇలా ఉండకూడదు. బహుశా హైదరాబాద్ పోలీసులు దీనిని గమనించలేదు. కానీ ఇలాంటి భాష చాలా భయంకరం. మర్యాదగా, గౌరవప్రదంగా ప్రవర్తించాలి. లేకుంటే ప్రతిఫలం తప్పక ఉంటుంది అంటూ స్మాల్ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో పోలీసులకు పరోక్షంగా ఫిర్యాదు చేసింది చిన్మయి శ్రీపాద.

అసలేం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం చిన్మయి.. తన భర్త రాహుల్ రవీంద్రన్ హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే కుమార్తె దృప్త నో చెప్పిందని పోస్ట్ పెట్టింది. అయితే తన భర్త.. హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకు నువ్వంటే ఇష్టం అది గుర్తుంచుకో అని చెప్పినట్లు తెలిపింది. అప్పటి నుంచి రాహుల్ మళ్లీ హగ్ ఇవ్వడానికి ట్రై చేయలేదని వెల్లడించింది. తాను కూడా అలానే ఉంటానని పేర్కొంది.

ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరకు వచ్చినా సరే.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా కనీసం ఆమె బుగ్గ గిల్లనని తెలిపింది. వాళ్ల పేరెంట్స్ పర్మిషన్ తీసుకునే టచ్ చేస్తానని చెప్పింది. ఆ వెంటనే సమంత.. రాహుల్ అంతే అలానే చేస్తాడని పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా నెట్టింట చర్చ మొదలైంది. చిన్మయి తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ కొందరు.. మరికొందరేమో ఆమె మాటలు కరెక్టే అని కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్ గా ఘాటుగానే స్పందించిన చిన్మయి.. ఇప్పుడు పరోక్షంగా పోలీసులకు కంప్లైంట్ చేసింది.

Tags:    
  • Chinmayisripada 
  • Samantha 
  • Filmindustry 
  • Chinmayi 
  • Rahulravindran 
  • Chinmayiinstapost 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS