ఆఫ్రికన్ జాన‌ప‌ద‌ పురాణేతిహాస కథ‌తో: మ‌రో చంద‌మామ క‌థ‌లాంటి ఇంట్రెస్టింగ్ డ్రామా

ముఖ్యంగా నైజీరియన్ పురాణాలు, వారి సంస్కృతిని ఆధునిక హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో చూపించడంపై ఆఫ్రికన్ అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు.

Update: 2026-07-30 04:07 GMT

వ‌రుస‌గా మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ నుంచి భారీ సినిమాలు భార‌తదేశంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. వీటిలో సంచ‌ల‌నాల‌ `బ్లాక్ పాంథ‌ర్` సీక్వెల్ శ్వేత జాతీయ క‌ళాకారుల‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అధునాత‌న సాంకేతిక‌త‌తో రూపొందుతున్న బ్లాక్ బ‌స్ట‌ర్ `బ్లాక్ పాంథ‌ర్` సీక్వెల్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు భార‌తీయ సినీప్రేమికులు. ఇప్పుడు అలాంటి మ‌రో విజువ‌ల్ వండ‌ర్ ఆఫ్రిక‌న్ శ్వేత‌జాతీయ ఆర్టిస్టుల‌తో రూపొందుతోంది.

పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ ఆఫ్రికన్ ఫాంటసీ చిత్రం `చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్` అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌ఖ్యాత ఆప్రిక‌న్ ర‌చ‌యిత‌ తోమి అడెయెమి రాసిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన నవల ఆధారంగా.. ప్రముఖ దర్శకురాలు జీనా ప్రిన్స్-బైత్‌వుడ్ ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ సంస్కృతి, పురాణాలు, మాయాజాలం నేపథ్యంగా సాగే ఒరీషా ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పై అత్యద్భుతంగా ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ చిత్రం 15 జనవరి 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు-ఐమాక్స్ లలో విడుదల కానుంది.

ఈ ట్రైలర్‌కు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నైజీరియన్ పురాణాలు, వారి సంస్కృతిని ఆధునిక హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో చూపించడంపై ఆఫ్రికన్ అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. కేవలం ఆఫ్రికన్ పోరాటాలు లేదా పేదరికం నేపథ్యంగా కాకుండా... వారి మాయాజాలం.. కల్పిత కథలతో కూడిన ఒక గ్రాండ్ ఫాంటసీ ప్రపంచాన్ని చూపించడం అభినందనీయమని పుస్తక ప్రియులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా నవల చదివి.. తెరపై ఈ అద్భుతాన్ని చూడాలని నిరీక్షిస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.

ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దక్షిణాఫ్రికా నటి తుసో ఎంబేడు ప్రధాన పాత్రలో నటించగా.. ఈ న‌టితో పాటు డామ్సన్ ఇద్రిస్, అమాండ్లా స్టెన్‌బర్గ్ , పాపుల‌ర్ నటుడు చివెటెల్ ఎజియోఫోర్ కీలక పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు నైజీరియాకు చెందిన స్థానిక నటీనటులకు కూడా ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో చోటు కల్పించడం విశేషం. ఈ స్టార్ కాస్ట్ .. వారి నటన సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. బ్లాక్ పాంథర్, ది ఉమెన్ కింగ్ చిత్రాల సరసన నిలిచే స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ ట్రైలర్‌పై నెటిజన్ల నుంచి ఒక ప్రధానమైన విమర్శ కూడా ఎదుర‌వుతోంది. ట్రైలర్ నేపథ్య సంగీతంగా పాప్ స్టార్ బియాన్స్ పాటను ఉపయోగించడం చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు. ఒక పురాతన, గంభీరమైన ఫాంటసీ కథకు ఆధునిక పాప్ సంగీతం సెట్ కాలేదని... అది ట్రైలర్ మూడ్‌ను కొంతవరకు చెడగొట్టిందని కామెంట్ల రూపంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. బియాన్స్ పాటకి బదులుగా సాంప్రదాయ ఆఫ్రికన్ శైలి సంగీతాన్ని లేదా ఆర్కెస్ట్రా స్కోర్‌ను ఉపయోగించి ఉంటే ట్రైలర్ ఇంపాక్ట్ మరింత అద్భుతంగా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

సంగీతంపై చిన్నపాటి విమర్శలు ఉన్నా..`చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్` ట్రైలర్ మాత్రం హాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ఒక ఆఫ్రికన్ రచయిత్రి రాసిన పుస్తకం ఆధారంగా.. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ రికార్డులు సృష్టిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. విజువల్స్, అద్భుతమైన నటీనటుల ప్రతిభ, బలమైన కథాంశంతో వస్తున్న ఈ గ్రాండ్ ఆఫ్రికన్ ఎపిక్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Full View
Tags:    

Similar News