కొత్త దంపతులతో చరణ్ ఉపాసన!
తాజాగా కొత్త దంపతులతో చరణ్ దంపతులు సోలో గా దిగిన స్నాప్ ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. సాయంసంధ్యా వేళ గార్డెన్ లో పార్టీ సమయంలో నలుగురు ఇలా కెమెరాకి ఫోజులిచ్చారు.
కొత్త దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన తరుణం ఇది. హల్దీ ...మొహందీ వేడుక నుంచి పెళ్లి పట్టు వస్త్రాల వరకూ జోడీ ఎంత అందంగా ముస్తాబైందో? చూడా లంటే రెండు కళ్లు సరిపోవడం లేదు. స్పెషల్ డిజైనర్ దుస్తుల్లో వరుణ్-లావణ్య లు మిరుమిట్లు గొలుపుతున్నారు. ఖరీదైన దుస్తులు ఆ జోడీని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి.
తాజాగా కొత్త దంపతులతో చరణ్ దంపతులు సోలో గా దిగిన స్నాప్ ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. సాయంసంధ్యా వేళ గార్డెన్ లో పార్టీ సమయంలో నలుగురు ఇలా కెమెరాకి ఫోజులిచ్చారు. వరుణ్ ..చరణ్ ఒకే డిజైనర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ దుస్తుల్లో అన్నదమ్ములిద్దరు మనోహరంగా ఫోకస్ అవుతున్నారు. ఇక ఉపాసన నలుపు వర్ణం డిజైనర్ దుస్తుల్లో తళుకులీనారు.
ఆమె ఎంపిక చేసుకున యాక్సరీస్...నెక్ పై డిజైనర్ న్లెస్ ని ఆమెని మరింత ప్రకాశ వంతంగా మార్చాయి. ఇక లావణ్య వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. కొత్త పెళ్లి కూతురు పార్టీ సమమంలో ధగధగలాడిపోతున్నారు. చరణ్ ..వరుణ్ లను వేరు చేసి చూస్తే.. ఇకపై లావణ్య..ఉపాసన కొణిదెల వారింట తోడు కోడళ్లుగా కాపురం చేయనున్నారు. ఇప్పటివరకూ ఆ ఫ్యామిలీ ఇంట కోడలంటే ఉపాసన మాత్రమే కనిపించేవారు.
ఇకపై ఆమెతో పాటు లావణ్య కూడా కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు. మరి లావణ్య నటిగా కొనసాగు తారా? లేదా? అన్నది సస్పెన్స్. ప్రస్తుతానికి లావణ్య చేతిలో సినిమాలైతే లేవు. వరుణ్ తో ఎంగేజ్ మెంట్ అయిన దగ్గర నుంచి లావణ్య కొత్త సినిమాల అంశం మీడియాలోనూ రాలేదు. భర్త వరుణ్ వృత్తి పరంగా బిజీగా ఉన్నాడు. 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో పాన్ ఇండియాలో పరిచయమవుతున్నాడు.